గుబురు గడ్డం పెంచుకొని కనిపిస్తోన్న స్టార్ హీరో ఎవరో గుర్తుపట్టారా? ఇతను కోలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన హీరో అయి ఉండచ్చు.. కానీ పాన్ ఇండియా రేంజ్‌లో క్రేజ్ ఉంది. అన్నట్లు ఈ మధ్యన హాలీవుడ్ సినిమాల్లో కూడా నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నాడు.
లవ్, సీరియస్, కామెడీ, యాక్షన్, థ్రిల్లర్.. ఇలా ఏ జానర్‌కైనా ఈ స్టార్ హీరో సూట్ అవుతాడు. అందుకే ఇతనికి దేశ వ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీ లో కూడా భారీ ఫాలోయింగ్ ఉంది. అందుకే ఇటీవల నేరుగా తెలుగు సినిమాతో ప్రేక్షకులను పలకరించాడు. బ్లాక్ బస్టర్ హిట్‌ను సొంతం చేసుకున్నాడు.

ఈ పాటికే అర్థమై ఉంటుంది.. మనం ఎవరి గురించి మాట్లాడుకుంటున్నామో.. యస్.. పై ఫొటోలో ఉన్నది మరెవరో కాదు ఇటీవల మనకు పాఠాలు చెప్పేందుకు వచ్చిన ‘సార్’ హీరో, కోలీవుడ్ స్టార్ ధనుష్. తాజాగా ముంబై ఎయిర్ పోర్ట్‌లో కనిపించిన ధనుష్ కు పెరిగిన జుట్టు, గుబురు గడ్డంతో గుర్తుపట్టలేకుండా మారిపోయాడు.
దీనికి తోడు నల్లటి అద్దాలు ధరించి ఉండడంతో అతనిని వెంటనే గుర్తుపట్టలేకపోయారు. ఈ నేపథ్యంలో ధనుష్ న్యూ లుక్ ఫొటోలు, వీడియోలు నెట్టింట్లో వైరల్‌గా మారిపోయాయి.