Anchor Anasuya : స్టార్ యాంకర్ అనసూయను గత కొంతకాలంగా వేధిస్తున్న వ్యక్తిని తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇంతకీ ఎవరా వ్యక్తి? ఏమా కథ అంటారా? గత కొంతకాలంగా ఓ వ్యక్తి అనసూయ ఫోటోలతో పాటు వీడియోలపై అభ్యంతకర కామెంట్స్ పెపడుతున్నాడు. అనసూయ వ్యక్తిగత జీవితాన్ని సైతం వదలకుండా అసభ్యంగా పోస్టులు పెడుతున్నాడు. ఇటీవలే అనసూయ తన విషయమై పెడుతున్న అభ్యంతరకర కామెంట్స్, వీడియోలపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. అనసూయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న సైబరాబాద్ పోలీసులు ఎట్టకేలకు నిందితుడిని పట్టుకున్నారు.
గత కొన్ని రోజులుగా అనసూయ ఫిర్యాదుపై విచారణ నిర్వహించిన పోలీసులు అనసూయను సోషల్ మీడియాలో వేధిస్తున్నది.ఆంధ్రప్రదేశ్‌లోని కోనసీమ జిల్లా పాసలపూడి గ్రామానికి చెందిన ప్రైవేటు ఉద్యోగి పండరి రామ వెంకట వీర్రాజుగా పోలీసులు గుర్తించారు.అయితే.. పోలీసులు నిందితుడిని పట్టుకోవడానికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా చిక్కలేదు. మొబైల్ నంబర్లను మారుస్తూ తప్పించుకుని తిరుగుతూ పోలీసులకే ఒకరకంగా సవాల్ విసిరాడు. వారం రోజులు పాటు కోనసీమలో మకాం వేసి మరీ చివరకు పోలీసులు పండరిని అరెస్ట్ చేశారు.
పండరిపై సైబర్ పోలీసులు 354 (A)(D), 559 ఐపీసీ సెక్షన్ 67 67(A) ఐటీ యాక్ట్ 2000, 2018 కింద పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో ప్రవేశ పెట్టారు. పండరి.. ఒక్క ట్విటర్‌లోనే కాకుండా ఫేస్‌బుక్, ఇన్‌స్టాగ్రామ్, టెలిగ్రామ్ యాప్స్‌లో అసభ్యకరమైన పోస్టులు పెడుతున్నాడు. కేవలం అనసూయపైనే కాకుండా టాలీవుడ్ హీరోయిన్స్ ఫొటోలపై ‘సాయి రవి 267’అనే ట్విటర్ అకౌంట్ ద్వారా అసభ్యకర కామెంట్స్ పెడుతున్నాడు.దీంతో ఈ నెల 17న సైబర్ క్రైమ్ పోలీసులకు యాంకర్ అనసూయ ఫిర్యాదు చేసింది. పండరి అసభ్యకరంగా ఫోటోలు పెట్టిన వారిలో అనసూయతో పాటు విష్ణు ప్రియ, రష్మీ, ప్రగతి, మంత్రి రోజా సైతం ఉన్నారు.