The Ghost: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం ఫుల్ ఫామ్ లో ఉన్నారు. ఈ ఏడాది ప్రారంభంలో తన తనయుడు అక్కినేని నాగ చైతన్యతో కలిసి ‘బంగార్రాజు’ సినిమాతో మంచి హిట్ అందుకున్నారు. అలానే రీసెంట్‌గా వచ్చిన ” బ్రహ్మాస్త్ ” చిత్రంలో మంచి రోల్ తో అదరగొట్టారు. ఇక ఇప్పుడు అదే ఊపులో మళ్ళీ ఇంకో సక్సెస్ అందుకోవడానికి రెడీ అయ్యాడు ఈ మన్మధుడు. నాగ్ ప్రస్తుతం ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో ‘ది ఘోస్ట్’ సినిమాలో నటించారు. దసరా కానుకగా నేడు ప్రేక్షకుల ముందుకు రానుంది ఈ చిత్రం. కాగా ఈ చిత్రానికి ది ఘోస్ట్ అనే టైటిల్ పెట్టి మొదటినుండే క్యూరియాసిటీని పెంచేసింది చిత్ర బృందం. ఇప్పటి వరకు రిలీజ్ అయిన యాక్షన్ ప్రోమో, ట్రైలర్ కు ప్రేక్షకుల నుంచి విశేషమైన స్పందన వచ్చింది.
ఇక ఈ తరుణంలోనే ఈ సినిమాకు సంబంధించి ప్రీమియర్ షో లు కూడా పూర్తి అయ్యాయి. ఈ మూవీలో సోనాల్ చౌహన్ హీరోయిన్ గా నటిస్తుండగా శ్రీ వెంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్పి మరియు నార్త్ స్టార్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై ఈ సినిమాను సంయుక్తంగా నిర్మించారు. ఇక ఈ సినిమా స్టోరీ విషయానికి వస్తే … ఈ సినిమాలో అక్కినేని నాగార్జున విక్రమ్ అనే పాత్రలో కనిపించాడు. ఈయన ఇండియన్ అంబాసిలో పనిచేస్తాడు. అయితే ఒక రోజు విక్రమ్ కు తన చెల్లెలు కూతురికి ఏదో ప్రమాదం జరగటంతో ప్రమాదం నుండి కాపాడమని విక్రమ్ ను అడుగుతుంది. దీంతో విక్రమ్ తన మేనకోడల్ని రక్షించడానికి రంగంలోకి దిగుతాడు. అయితే ఆ సమయంలో విక్రమ్ కు కొందరు క్రిమినల్స్ ఎదురవుగా వారిపై దాడి చేస్తాడు. అలా చివరికి విక్రం తన మేనకోడల్ని ఎలా రక్షిస్తాడు. ఆ సమయంలో విక్రమ్ ఇంకెన్ని అడ్డంకులు ఎదుర్కొంటాడు అనేది మిగిలిన కథ.
The Ghost : ది ఘోస్ట్ లో అదే మైనస్…
కాగా రా ఆఫీసర్ పాత్రలో నాగార్జున అదరగొట్టారని యాక్షన్ సన్నివేశాల్లో దుమ్ము లేపారని అంటున్నారు. అలానే హీరోయిన్ సోనాల్ చౌహన్ కూడా నాగార్జునకు మంచి జోడిగా కనిపించింది. యాక్షన్ సన్నివేశాలు ఈ సినిమాకు ప్రధాన ఆకర్షణగా పరిగణించాలి. రొమాంటిక్ కూడా బాగున్నాయి. ఇక సంగీత దర్శకుడు మార్క్ కే రోబిన్ మంచి సంగీతాన్ని అందించాడని అంటున్నారు. యాక్షన్ సీన్స్ లో లో కూడా మంచి ప్రతిభ కనబరిచారని కాకపోతే ఆశించిన స్థాయిలో కాకుండా కొంత మేర సంగీతం తగ్గిందని పలువురు అభిప్రాయపడుతున్నారు. ఆ ఒక్కటి తప్ప సినిమా బ్లాక్ బస్టర్ అని ప్రేక్షకులు చెబుతున్నారు.