కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ మూవీ ది ఘోస్ట్. ఈ మూవీకి మొదటి ఆట నుంచి పాజిటివ్ టాక్ వస్తుంది. యాక్షన్ కథాంశాలు ఇష్టపడే ప్రేక్షకులకి ఈ సినిమా బాగా నచ్చుతుంది. ముఖ్యంగా ఈ మూవీలో యాక్షన్ఎలిమెంట్స్ ప్రధాన ఆకర్షణంగా నిలిచాయి. అలాగే కింగ్ నాగార్జున కూడా సరికొత్త లుక్ లో కనిపించి అలరించాడు. వయస్సు ప్రభావం లేకుండా యాక్షన్ సన్నివేశాలలో నటించి మెప్పించాడు. ఇక హీరోయిన్ సోనాల్ చాహన్ కూడా యాక్షన్ సీక్వెన్స్ లో బాగానే ఆకట్టుకుంది.
ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో సినిమా మినిమమ్ బాగున్నా కూడా ఓటీటీ ఛానల్స్ వెంటనే ఆ మూవీ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని సొంతం చేసుకుంటున్నాయి. ముఖ్యంగా నెట్ ఫ్లిక్స్ సంస్థ తెలుగు సినిమాల మీద ఎక్కువ ఫోకస్ పెట్టింది. తెలుగు సినిమాకి ఉన్న హ్యుజ్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకొని తెలుగు ఆడియన్స్ వ్యూయర్ షిప్ ని పెంచుకోవాలని ప్రయత్నం చేస్తుంది.
అందులో భాగంగానే స్టార్ హీరోల చిత్రాలని ఎక్కువ మొత్తం డబ్బులు పెట్టి ఓటీటీ రైట్స్ ని సొంతం చేసుకుంటుంది. ఇప్పటికే మెగాస్టార్ చిరంజీవి గాడ్ ఫాదర్ రైట్స్ ని సొంతం చేసుకున్న నెట్ ఫ్లిక్స్ సంస్థ ఇప్పుడు నాగార్జున ది ఘోస్ట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులని సొంతం చేసుకుంది. ఇక ఈ హక్కుల కోసం భారీ మొత్తంలో ఆఫర్ చేసినట్లు తెలుస్తుంది. మిగిలిన చానల్స్ పోటీకి వచ్చిన అందరికంటే ఎక్కువ మనీ నెట్ ఫ్లిక్స్ ఆఫర్ చేయడంతో ఘోస్ట్ నిర్మాతలు వారితో ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తుంది.