కింగ్ నాగార్జున హీరోగా ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కి ప్రేక్షకుల ముందుకి వచ్చిన చిత్రం ది ఘోస్ట్. భారీ బడ్జెట్ తో యాక్షన్ థ్రిల్లర్ గా ఈ సినిమాని దర్శకుడు ప్రవీణ్ సత్తారు తెరకెక్కించారు. ఇక భారీ హైప్ తో పాజిటివ్ బజ్ తోనే ఈ మూవీ రిలీజ్ అయ్యింది. అయితే గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ అయిన రోజే ఈ మూవీని కూడా నిర్మాతలు ధైర్యం చేసి థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకి తీసుకొచ్చారు. నిర్మాతలకి సినిమా వాయిదా వేసుకోమని కొంత మంది సినీ పెద్దలు సలహా ఇచ్చిన కూడా వారు వెనక్కి తగ్గకుండా రిలీజ్ చేశారు. అయితే రిలీజ్ రోజు సినిమాకి వారు అంచనాలకి తగ్గట్లుగానే పాజిటివ్ టాక్ వచ్చింది.
కాని యాక్షన్ థ్రిల్లర్ కథాంశం కావడంతో కేవలం ఒక వర్గం ఆడియన్స్ కి మాత్రమే ఈ మూవీ పరిమితం అయ్యింది. గాడ్ ఫాదర్ సినిమా కమర్షియల్ సక్సెస్ కావడంతో మెజారిటీ ప్రేక్షకులు ఆ సినిమా చూడటానికి ఆసక్తి చూపించారు. దీంతో ది ఘోస్ట్ మూవీ కలెక్షన్స్ పూర్తిగా డ్రాప్ అయిపోయాయి. ఈ సినిమా `థీయాట్రికల్ రైట్స్ బిజినెస్ ఏకంగా 22 కోట్ల వరకు జరిగింది. ఆ స్థాయిలో కలెక్షన్స్ వస్తేనే సినిమా సక్సెస్ అందుకున్నట్లు అయితే. లాంగ్ రన్ లో ఈ మూవీ కేవలం 9 కోట్లు కోట్లు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసింది.
షేర్ పరంగా చూసుకుంటే కేవలం 4.5 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో ఏకంగా ఈ మూవీ 17 కోట్ల మేరకు నష్టాన్ని మిగిల్చింది. ఓ విధంగా నిర్మాతలకి ఇది భారీ నష్టం అని చెప్పాలి అయితే డిజిటల్, ఒటీటీ రైట్స్ రూపంలో పెట్టిన పెట్టుబడిలో కొంత వచ్చేసింది. దీంతో భారీ నష్టాలు రాకుండా కొంత వరకు సేఫ్ అయ్యారనే మాట ఇప్పుడు వినిపిస్తుంది. ఆఫీసర్ సినిమా నాగార్జునకి డిజాస్టర్ ఇచ్చిన దాని మీద పెట్టిన పెట్టుబడి తక్కువ అయితే ఈ సినిమా కంటెంట్ మీద నమ్మకంతో నిర్మాతలు భారీగా ఖర్చు చేసారు. అయితే రాంగ్ టైమింగ్ లో రిలీజ్ చేయడం వలన భారీ నష్టాలు ఎదుర్కోవాల్సి వచ్చిందని సమాచారం.