Prabhas: పాన్ ఇండియా సూపర్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన “ఆది పురుష్” సినిమా టీజర్ అక్టోబర్ రెండవ తారీకు విడుదల చేస్తున్న సంగతి తెలిసిందే. బాలీవుడ్ దర్శకుడు ఓమ్ రౌత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రం టీజర్ నీ ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ చేతుల మీదగా విడుదల చేయించే ఆలోచనలో సినిమా యూనిట్ ఉంది. ఇందుకోసం అక్టోబర్ మొదటి తారీకు యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ నీ ఆహ్వానించడానికి హీరో ప్రభాస్ తో పాటు దర్శకుడు మరి కొంతమంది యూనిట్ సభ్యులు వెళుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
“ఆది పురుష్” సినిమా రామాయణం ఆధారంగా తెరకెక్కిన సినిమా కావటంతో… టీజర్ వేడుక చాలా గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి సినిమా యూనిట్ రెడీ అయింది. ప్రభాస్ ఈ సినిమాలో రాముడి పాత్రలో కనిపిస్తున్నాడు. కృతి సన్నన్ సీత పాత్రలో నటిస్తోంది. “ఆది పురుష్” టీజర్ పోస్టర్ రేపు గ్రాండ్ గా సాయంత్రం 7:11 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్లు సమాచారం. టీజర్ పోస్టర్ రిలీజ్ చేయడం ద్వారా అభిమానులలో మరింత ఆతృత పెంచటానికి మేకర్స్ రెడీ అయ్యారు. అయితే ప్రభాస్ “ఆది పురుష్” కోసం .. డైరెక్టర్ ప్రశాంత్ వర్మ తన కొత్త సినిమా “హనుమాన్” టీజర్ వాయిదా వేస్తున్నట్లు ట్విట్టర్ ద్వారా వెల్లడి చేశారు.
మేటర్ లోకి వెళ్తే రాముడు కంటే హనుమంతుడు ముందు రాకూడదని… దసరా రోజు విడుదల కావాల్సిన “హనుమాన్” టీజర్.. వాయిదా వేస్తున్నట్లు తెలియజేశారు. రాముడి కోసం హనుమాన్ వేచి ఉండి స్వాగతం పలకాలని ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రశాంత్ వర్మ పేర్కొనడం జరిగింది. ఇదే సమయంలో త్వరలో “హనుమాన్” టీజర్ రిలీజ్ కొత్త తేదీని ప్రకటిస్తామని క్లారిటీ ఇచ్చారు. దీంతో ప్రశాంత్ వర్మ “హనుమాన్” సినిమా యూనిట్ కి ప్రభాస్ అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.