Bigg Boss 6: ప్రపంచ టెలివిజన్ రంగంలో బిగ్ బాస్ రియాల్టీ షోకి తిరుగులేని క్రేజ్ ఉన్న సంగతి తెలిసిందే. బయట ప్రపంచానికి దూరమై బిగ్ బాస్ హౌస్ లో టైటిల్ గెలవడానికి పోటీపడే ఈ గేమ్ ఎంతోమందిని ఆకట్టుకుంటూ ఉంటది. గేమ్ లో ఆడే సబ్యులకు బిగ్ బాస్ హౌస్ లో ఏర్పడే బంధాలు షో చూసే వాళ్లకి ఎంతగానో ఇంట్రెస్ట్ కలిగిస్తాయి. బిగ్ బాస్ ఇచ్చే ఆదేశాలు ఆధారంగా షో రన్ అవుతూ ఉంటది. ఈ క్రమంలో ఒక్కోసారి గొడవలు తారాస్థాయికి చేరుకుంటాయి. అదే సమయంలో ఎదుట వ్యక్తిపై అభిమానం కూడా పెరిగే పరిస్థితులు ఈ షోలో ఉంటాయి. షో ఎంత ఎంటర్టైన్మెంట్ అందిస్తదో అదే రీతిలో వివాదాలకు కూడా కేంద్రంగా నిలుస్తూ ఉంటది. షోకి చెందిన సభ్యులు వేసుకునే వస్త్రధారణ వ్యవహరించే తీరు చాలా సామాజిక సంస్థలకు పలు రాజకీయ పార్టీలకు ఎప్పటినుండో విమర్శలకు తావిస్తోంది.
తెలుగు రాష్ట్రాలలో వివిధ పార్టీల రాజకీయ నేతలు బిగ్ బాస్ షోపై విమర్శలు చేసిన సందర్భాలు ఉన్నాయి. బిగ్బాస్ షో వల్ల సమాజం చెడిపోతుందని చాలామంది నేతలు విమర్శలు చేయడం జరిగింది. ముఖ్యంగా సిపిఐ నారాయణ .. ఎప్పటినుండో బిగ్ బాస్ షో బ్యాన్ చేయాలని కోరుతూ ఉన్నారు. ఈ క్రమంలో హోస్ట్ నాగార్జున పై.. విమర్శలు కూడా చేయడం జరిగింది. పరిస్థితి ఇలా ఉంటే ఇటీవల ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని దాఖలైన పిల్ పై న్యాయస్థానం విచారణ చేపట్టింది.
పిల్ లో ఐబీఎఫ్ గైడ్ లైన్స్ పాటించలేదు, అశ్లీలత ఎక్కవగా ఉందన్న పిటిషనర్ తరఫు న్యాయవాది వాదించారు. దీంతో అశ్లీలతపై ఘాటుగా స్పందించిన కోర్టు, ప్రతివాదులకు నోటీసులపై త్వరలో నిర్ణయిస్తామని కోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత విచారణ అక్టోబర్ 11కు వాయిదా వేయడం జరిగింది. దీంతో బిగ్ బాస్ షో నిర్వాహకులకు కోర్టు నోటీసులతో గట్టి షాక్ ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. మరి ఈ విషయంలో న్యాయస్థానం ఏ రకంగా షో నిర్వాహకుల పట్ల వ్యవహరిస్తుందో అన్నది ఆసక్తికరంగా మారింది.