Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ రెండో వారం కెప్టెన్సీ టాస్క్ పోటీదారులకు సంబంధించి ఇంటి సభ్యులు పోటీ పడుతున్నారు. రెండో వారం ఎలాగైనా కెప్టెన్ కావటానికి బిగ్ బాస్ పెట్టిన “సిసింద్రీ” టాస్క్ లో రాణిస్తూ ఉన్నారు. ఈ క్రమంలో రేవంత్, అభినయశ్రీ, శ్రీ సత్య మంగళవారం జరిగిన ఎపిసోడ్ లో సరిగా పెర్ఫార్మన్స్ చేయక పోవడంతో .. అనర్హులుగా మిగిలిపోయారు. అయితే ప్రస్తుతం బుధవారం జరగబోయే ఎపిసోడ్ లో మిగతా కంటెస్టెంట్ ల మధ్య భారీగానే ఫైట్ జరుగుతున్నట్లు తెలుస్తోంది.
ఇదిలా ఉంటే రెండో వారం ఓటింగ్ ప్రక్రియ పరంగా చూసుకుంటే ఓ కంటెస్టెంట్ మాత్రం ఉన్న కొద్ది వెనక్కి వెళ్ళిపోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. పూర్తి విషయంలోకి వెళ్తే అభినయశ్రీ ఓటింగ్ గ్రాఫ్ అందరిలో కంటే పడిపోయిందట. ఈమె కంటే ముందుగా శాని, రాజ్ ముందరకి వెళ్లిపోవడం జరిగిందట. అభినయశ్రీ హౌస్ లో పెద్దగా యాక్టివ్ లేకపోవడంతో పాటు ఆమె ఒరిజినల్ షేడ్ కూడా ఇంకా చూపించకపోవడంతో.. ఈవారం గ్యారెంటీగా ఎలిమినేట్ అయ్యే అవకాశం ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఇప్పటికే రెండో వారం కెప్టెన్సీ పోటీదారులుగా అనర్హత కూడా పడటంతో.. ఒకసారిగా ఈమె ఓటింగ్ గ్రాఫ్ పడిపోయినట్లు టాక్ వినిపిస్తోంది. ఒకవేళ అభినయశ్రీ హౌస్ నుండి ఎలిమినేట్ అయితే బిగ్ బాస్ లో సీనియర్ ఎలిమినేషన్ సెంటిమెంట్ మరోసారి రిపీట్ అయినట్టే అని ఆడియెన్స్ అంటున్నారు. గత సీజన్ లలో సీనియర్స్ హేమ, ఉమాదేవి, కరాటే కళ్యాణి లాంటి వాళ్లు ముందుగానే వెళ్లిపోవడం జరిగింది. అయితే ఇప్పుడు అదే తరహాలో అభినయశ్రీ కూడా వెళ్లిపోయే అవకాశం ఉందని అంటున్నారు. మరి రెండవ వారం హౌస్ నుండి ఎవరు ఎలిమినేట్ అవుతారో చూడాలి.