Bigg Boss 6: బిగ్ బాస్ సీజన్ సిక్స్ కి సంబంధించి రెండో వారం కెప్టెన్సీ ఎన్నిక ప్రస్తుతం హౌస్ లో జరుగుతున్న సంగతి తెలిసిందే. కెప్టెన్సీ పోటీదారులుగా చంటి, సూర్యా, సుల్తానా, రాజ్ ఎంపిక కాగా .. ఓటింగ్ ప్రక్రియ విధానం ద్వారా ఇంటి సభ్యులు కొత్త కెప్టెన్ నీ ఎన్నుకుంటూ ఉన్నారు. గురువారం ఎపిసోడ్ లోనే ఓటింగ్ ప్రక్రియలో రాజ్ అందరికంటే ఎక్కువ ఓట్లు రాబట్టుకోవడం జరిగింది. ఇక శుక్రవారం బిగ్ బాస్ లైవ్ లో రాజ్ కెప్టెన్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.
పోటా పోటీగా చంటి, రాజ్ మధ్య పోటీ నెలకొన్న గాని చివరాఖరికి రాజ్ గెలవడం జరిగిందంట. హౌస్ మేట్స్ అందరూ రాజ్ కి చాలా సంతోషంగా ఓట్లు వేశారట. ఈ క్రమంలో కొత్త కెప్టెన్ రాజ్ డ్యూటీలు ఎవరికి ఏది రాజ్ ఇస్తాడు అన్నది ఇప్పుడు సస్పెన్స్ గా మారింది. ఇక ఇదే రోజు వరస్ట్ పెర్ఫార్మర్ కూడా ఎన్నుకునే సమయం ఆసన్నం కావడంతో ఎవరు జైల్లోకి వెళ్తారు అన్నది కూడా సస్పెన్స్ గా నెలకొంది. మొదటివారం వీకెండ్ అసలు రాజ్.. నువ్వు హౌస్ లో ఉన్నావా..? అంటూ నాగార్జున ప్రశ్నించడం తెలిసిందే.
అయితే ఒక్క వారంలోనే తన గేమ్ మొత్తం చేంజ్ చేసి.. రెండోవారానికి కెప్టెన్ కావడం పట్ల ఆడియన్స్ రాజ్ ఆటపై పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు. ఇదిలా ఉంటే రెండో వారం హౌస్ నుండి ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ల లిస్టులో..రాజ్ పేరు కూడా ఉంది. మరి మనోడు రెండో వారం సేవ్..అయి కెప్టెన్ గా హౌస్ ని ఏలుతాడో.. లేకపోతే ఎలిమినేట్ అవుతాడో చూడాలి.