తల్లి గర్భాన్ని చీల్చుకొని మరో జీవం ఈ లోకంలోకి వస్తుంది. ఇక బిడ్డని గర్భంలో ఓ తల్లి మానవులలో అయితే తొమ్మిది నెలలు మోస్తుంది. అయితే ఇది జీవుల బట్టి ఒక్కో విధంగా ఉంటుంది. జీవం పుట్టుక అంటే అదో యుద్ధమనే చెప్పాలి. తల్లి జీవి తనతో తాను ఆ క్షణంలో అంతులేని యుద్ధం చేస్తుంది. ఇక బిడ్డ ఈ లోకంలోకి రాగానే తనని చూసి అంత వరకు ఉన్న నొప్పి, వేదనని క్షణాల్లో మరిసిపోతుంది. తన గర్భాన్ని చీల్చుకొని పుట్టిన బిడ్డని చూసి మురిసిపోతుంది. ఏ జీవులలో ఈయన తల్లి, బిడ్డ అనుబంధం ఇలాగే ఉంటుంది. మానవ జన్మలో ఉన్నాం కాబట్టి మన తల్లితో ఉన్న ఎమోషన్ మనకి తెలుస్తుంది. ఇతర జీవులలో తల్లి బిడ్డల ఎమోషన్ అంతగా తెలియదు. జీవం పుట్టుక ఎక్కడైనా ఒకే విధంగా జరుగుతుంది.
The birth of a newborn dolphin pic.twitter.com/corzjXs6fi
— H0W_THlNGS_W0RK (@wowinteresting8) August 23, 2022
తాజాగా డాల్ఫిన్ డెలివరీకి సంబందించిన విజువల్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. సముద్రంలో డాల్ఫిన్స్ ఎక్కువగా ఉంటాయి. అవి తమ పిల్లలని ఏలా కంటాయి అనే దానికి ఎవరి దగ్గర సరైన ఉదాహరణ లేదు. అయితే తాజాగా ఓ కెమెరామెన్ డాల్ఫిన్ డెలివరీకి సంబందించిన విజువల్ ని తన కెమెరాలో బంధించారు. ఈ వీడియోలో ట్విట్టర్ లో షేర్ చేయడంతో అది కాస్తా వైరల్ గా మారింది. సముద్ర గర్భంలో ఓ తల్లి డాల్ఫిన్ అలా ఈదుకుంటూ వెళ్లి సడెన్ గా తన పిల్ల డాల్ఫిన్ ని బయటకి రిలీజ్ చేస్తుంది. ఇక పిల్ల డాల్ఫిన్ కూడా పుట్టిన వెంటనే క్షణం కూడా ఆలస్యం లేకుండా తల్లితో సమానంగా ఈదడం మొదలు పెట్టింది. ఇక ఆ పిల్ల డాల్ఫిన్ తల్లి దగ్గరకి చేరిపోయి దాని చుట్టూ తిరుగుతూ కనిపించింది. పువ్వు పుట్టగానే పరిమళించడం అంటే ఇదేనేమో అనే మాట ఆ వీడియో చూసిన వారు కామెంట్స్ఈ చేయడం విశేషం. ఈ దృశ్యం వీడియో రూపంలో వైరల్ గా మారింది. ఏకంగా 3.3 మిలియన్స్ ఈ వీడియోని ట్విట్టర్ లో వీక్షించడం విశేషం.