BIGG BOSS: బిగ్ బాస్ హౌస్ లో గీతూ తనదైన శైలిలో ప్రదర్శన చూపిస్తూ దూసుకుపోతోంది. గత రెండు వారాలలో గీతూ ప్రదర్శనకు బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున 100కు 200 వందల మార్కులు వేసిన విషయం అందరికీ తెలిసిందే. మీరు చూసింది 20 శాతం మాత్రమే ఇంకా 80 శాతం ప్రదర్శన ఉందని గీతూ అప్పుడు నాగార్జునకు చెప్పింది. నాగార్జునకు చెప్పినట్లుగా గీతూ తన గేమ్ స్టార్టజీతో హౌస్ లో ప్రదర్శన చూపిస్తూ బిగ్ బాస్ వ్యూవర్స్ కి వినోదాన్ని పంచుతోంది.
గేమ్ ఆడుతూనే సినిమా పంచ్ డైలాగులు, డ్యాన్సులు, పాటలు పాడుతూ మామూలు వినోదం కాదు అంతకు మించి ప్రదర్శనతో హౌస్ లో తనకంటూ ఓ ముద్ర వేసుకుంది. అసలే అమ్మాయి… అందులోనూ రాయలసీమ… దీనికి తోడు ఇన్ని యాక్టివిటీస్ చేయడంతో బిగ్ బాస్ ఎపిసోడ్ లో ఎక్కువగా గీతూ సీన్లు ప్లే అవుతున్నాయి. ఇక అసలు విషయంలోకి వస్తే మూడో వారంలో కెప్టెన్సీ టాస్క్ లో భాగంగా అడవిలో ఆట అనే గేమ్ స్టార్ట్ అయిన విషయం అందరికీ తెలిసిందే.

ఈ గేమ్ లో భాగంగా హౌస్ కంటెస్టెంట్స్ లో దొంగలుగా కొందరు, పోలీసులుగా మరికొందరు వ్యవహరించారు.. పోలీస్ టీంలో ఆది, ఇనయ, ఫైమా, మెరీన, శ్రీసత్య, చంటి, ఆదిత్య, రాజ్, రోహిత్ ఉన్నారు. దొంగల టీంలో రేవంత్, ఆరోహి, సుదీప, వసంతి, నేహా, కీర్తీ, శ్రీహాన్, సూర్య, అర్జున్ ఉన్నారు. ఈ గేమ్ లో భాగంగా గీతూ అత్యాశ కలిగిన వ్యాపారస్తురాలిగా వ్యవహరిస్తోంది. మొత్తానికి ఈ దొంగా, పోలీస్ గేమ్ లో చివరకు పోలీస్ టీం గెలుస్తుంది.
ఈ గేమ్ ఆడుతున్న క్రమంలో దొంగల టీంలో ఉన్న సూర్య రాత్రి పూట గీతూ బ్యాగ్ కొట్టేయాలని చూస్తాడు. కానీ గీతూకి మెలుకువ రావడంతో సూర్య ప్రయత్నం విరమించుకుంటాడు. ఆ తర్వాత గీతూకి బాత్ రూం వస్తుంది. అప్పుడు తన నుండి దొంగిలించాలనుకున్న సూర్యకే బ్యాగ్ తాను వచ్చేంత వరకు జాగ్రత్తగా దాచి చూపుకోవాలని ఎంతో నమ్మకంతో సూర్యకు అప్పగిస్తుంది. అందుకు నా ప్రాణాలను అడ్డు వేసైనా సరే నీ బ్యాగ్ ను జాగ్రత్తగా చూసుకుంటానని సూర్య చెప్పిన మాటకు గీతా ఫిదా అయిపోతుందట. అందుకే అడవిలో ఆటలో గీతూ తన సపోర్ట్ సూర్యకే ఇస్తుంది. కెప్టెన్సీ పోటీదారుడిగా ఎంపిక అవ్వాలనే ఉద్దేశ్యంతో సూర్యకు గేమ్ లో భాగంగా ఎక్కువ డబ్బులను ఇస్తుంది. మరి సూర్య ఈ వారం కెప్టెన్సీ పోటీదారుడిగా ఉంటారో లేదో వేచి చూడాలి..!