Bigg boss 6: బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఈ వారం కాస్త పర్వాలేదనిపిస్తోంది. కంటెస్టెంట్స్ తగ్గుతున్నా కొద్దీ ఆట మరింత రసవత్తరంగా ఉంటుంది అనుకుంటే.. అదేమీ కనిపించడం లేదు. కనీసం నామినేషన్స్‌లో కూడా ఒక్కరు కూడా పెద్దగా కంటెంట్ ఇచ్చిన వారు లేరు. దీంతో రేటింగ్ ఢమాల్. అయితే కంటెస్టెంట్స్‌కి ఏమైనా పెద్దగా ఓటింగ్ పడుతోందా? అంటే అదీ లేదు. అంతా అంతకు తగ్గ బొంతలే. అయితే ప్రస్తుతానికి టాప్‌లో రేవంతే కొనసాగుతున్నాడు. రెండో స్థానంలో ఇనయ, మూడో స్థానంలో శ్రీహాన్ కంటిన్యూ అవుతున్నాడు.
వీరి స్థానాల్లో మార్పు అయితే ఏమీ లేదు.ఇక ఫైమా మినహా అంతా నామినేషన్స్‌లో ఉన్నారు కాబట్టి తరువాతి స్థానంలో ఆదిరెడ్డి ఉన్నాడు.వీరికి వచ్చిన ఢోకా అయితే ఏమీ లేదు కానీ ఈ వారం ఓటింగ్ పరంగా అయితే డేంజర్ శ్రీసత్యకే ఉంది. కానీ శ్రీ సత్య ఎలిమినేట్ అవుతుందా? అంటే కచ్చితంగా కాదనే చెప్పాలి. ఈ వారం మెరీనా ఎలిమినేట్ అయ్యే అవకాశాలే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ జంట హౌస్‌లో ఉన్నప్పటికీ కంటెంట్ మాత్రం పెద్దగా వస్తున్నది లేదు. కాబట్టి మెరీనాను ఎలిమినేట్ చేయాలని భావిస్తున్నట్టు తెలుస్తోంది.
నిజానికి బిగ్‌బాస్ ఆలోచనలు వేరుగా ఉంటాయి. ఎవరి నుంచైనా కంటెంట్ వస్తుంది అనుకుంటే మాత్రం వారిని ఎలిమినేట్ చేయడానికి ఇష్టపడడు.అసలే అంతంత మాత్రంగా నడుస్తున్న షోని కాస్తో కూస్తో కంటెంట్ ఇచ్చే కంటెస్టెంట్స్‌ని కూడా పోగట్టుకుని బిగ్‌బాస్ ఏం చేస్తాడు? కాబట్టి మెరీనాను ఎలిమినేట్ చేసి ఫ్యామిలీ వీక్‌లో ఆమెను తీసుకొస్తే కావల్సినంత కంటెంట్. అలాగే ఇప్పుడు శ్రీ సత్య-శ్రీహాన్‌ల యవ్వారం ఇంట్రస్టింగ్‌గా మారుతోంది. దీంతో ఆమెను పంపిస్తే చాలా కష్టమవుతుందనే ఉద్దేశ్యంలో బిగ్‌బాస్ ఉన్నట్టు తెలుస్తోంది.