Biggboss 6 : బిగ్‌బాస్ తెలుగు సీజన్ 6.. నాలుగో వారం కూడా పూర్తి కావొచ్చింది. ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. శుక్రవారంతో ఓటింగ్ ప్రాసెస్ ముగిసింది. అయితే ఈ వారం మాత్రం తొలి రోజు నుంచే ఎలిమినేషన్‌పై కాస్త క్లారిటీ వచ్చేసింది. అసలు నిజానికి ఈ సారి అంత వర్త్‌బుల్ క్యాండిడేట్స్ ఎవరూ లేరనే చెప్పాలి. ఈసారి ముందుగానే.. దాదాపు టాప్ 5, విన్నర్ తదితర విషయాల్లో కాస్తో కూస్తో క్లారిటీ వచ్చేసింది. ఎంటర్‌టైన్‌మెంట్‌కి అడ్డాగా ఉండాల్సిన బిగ్‌బాస్ షో.. అసలు ఎంటర్‌టైన్‌మెంట్ అనేదే లేకుండా పోయింది. ఎవరికి వారు సీరియస్‌గా రివెంజ్ మోడ్‌లో వెళ్లిపోతున్నారు.
ఇక ఈ వారం విషయానికి వస్తే 10 మంది నామినేషన్స్‌లో ఉన్నారు. వీరిలో టాప్‌లో యథావిధిగా సింగర్ రేవంత్ ఉన్నాడు. మనోడిని కంటెస్టెంట్స్ అంతా టార్గెట్ చేసి మరీ పైకి పంపిస్తున్నారు. ఆ తరువాత ఇనయ సుల్తానా ఉంది. 9 నామినేషన్స్ పడటంతో అమ్మడికి ఎక్కడలేని సింపథి వర్కవుట్ అయ్యింది. ఈ విషయం ఇనయాకు కూడా బాగా తెలుసు. నిజానికి ఇనయ ఫుల్ క్లారిటీతోనే ఆడుతున్నట్టుగా కనిపిస్తోంది. ఇక ఆమె తరువాత ఓటింగ్‌లో చాలా దగ్గరలో శ్రీహాన్ ఉన్నాడు. ఈ వారం శ్రీహాన్ ఓటింగ్‌లో ఇనయకు చాలా దగ్గరగా వచ్చాడు. ఒకానొక దశలో దాటేస్తాడని కూడా అనిపించింది. కానీ సాధ్యం కాలేదు.
Biggboss 6 : వీరిద్దరి వేషాలు ఆడియన్స్‌కి వెగటు పుట్టించేలా ఉన్నాయి
ఆ తరువాత కీర్తి ఉంది. ఈ వారం అమ్మడు కెప్టెన్ కూడా అయిపోయింది. ఇక ఈ వారానికి కీర్తికి తిరుగు లేనట్టే. వచ్చేవారం నామినేషన్స్‌లోనే ఉండదు. ఈ రెండు వారాలు కీర్తి సేఫ్. ఆ తరువాత గీతూ ఓటింగ్‌లో టాప్‌లో ఉంది. మొత్తంగా ఈ ఐదుగురు ఎలిమినేషన్ గండం నుంచి గట్టెక్కినట్టే. ఇక ఆ తరువాత వాళ్లే చాలా దగ్గరగా ఉన్నారు. ఇక డేంజర్ జోన్‌లో ఉన్నది రాజ్, అర్జున్ కల్యాణ్, సుదీప, సూర్య, ఆరోహి ఉన్నారు. ఈ ఐదుగురు చాలా దగ్గరలో ఉన్నారు. కేవలం పాయింట్స్ తేడాతోనే కొనసాగుతున్నారు. వీరిలో రాజ్.. మన పులిహోర రాజా అర్జున్‌కి ఢోకా లేదు. సత్యతో పులిహోర కలపడం బాగా అర్జున్‌కి బాగా కలిసొచ్చింది కాబట్టి బిగ్‌బాస్ ఇతడిని బయటకు పంపించారు. పైగా సూర్య, ఆరోహిలతో పోలిస్తే.. కాస్త ఓటింగ్‌లో మెరుగ్గానే ఉన్నాడు. సుదీప కూడా పర్వాలేదు. ఈవారం గట్టెక్కుతుంది. ఇక సూర్య, ఆరోహిల్లో ఒకరు పక్కా. వీరిద్దరి వేషాలు ఆడియన్స్‌కి వెగటు పుట్టించేలా ఉన్నాయి కాబట్టి వీళ్లు పోతేనే బాగుండు అన్నట్టు ఉన్నారు కాబట్టి వీరిద్దరికీ లీస్ట్ ఓటింగ్ పడింది. ఇక వీరిద్దరిలో ఆరోహి పక్కా వెళ్లిపోతుందని టాక్.