Bigg boss 6 : బిగ్‌బాస్ సీజన్ 6 తెలుగు ఎలిమినేషన్ టైం రానే వచ్చింది. మరికొన్ని గంటల్లో ఈ షో నుంచి మరొకరు నిష్క్రమించనున్నారు. తొలి వారం ఎలిమినేషన్ క్యాన్సిల్ చేసినప్పటికీ రెండో వారం షానీ, అభినయ శ్రీలను ఎలిమినేట్ చేసి లెక్క సరిచేశారు. ఆ తరువాత వారం అంటే గత వారం నేహా శ్రీ షో నుంచి ఎలిమినేట్ అయిపోయింది. ఇక ఈ వారం నేటి ఉదయానికే క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఓటింగ్ నిన్నటితో కంప్లీట్ అయిపోయింది. ఆ ఓటింగ్ ప్రకారం ఎవరు ఎలిమినేట్ అవుతారన్నది తేలిపోయింది.
అయితే ఈసారి బిగ్‌బాస్ నిర్వాహకులు ప్రేక్షకులతో కూడా గేమ్ ఆడుతున్నారు. తొలుత వాళ్ళే ఒక నేమ్ చెప్పి.. ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యారన్న వార్త లీక్ చేస్తున్నారు. దీంతో సోషల్ మీడియాలో సదరు కంటెస్టెంట్ ఎలిమినేట్ అయిపోయారంటూ రచ్చ రచ్చ అవుతోంది. ఆ తరువాత చల్లగా న్యూస్ తెలుస్తోంది. గత వారం కూడా ఇదే జరిగింది. తొలుత రాజ్ ఎలిమినేట్ అయిపోయినట్టు న్యూస్ బయటకు వచ్చింది. సాయంత్రానికి కానీ నేహా ఎలిమినేట్ అయినట్టు తెలియలేదు. దీనికి కారణం లేకపోలేదు. ఎలిమినేషన్ న్యూస్ ముందుగానే తెలిస్తే షోపై ఉన్న ఇంట్రెస్ట్ పోతుందని బిగ్‌బాస్ నిర్వాహకులే ముందుగా ఒక ఫేక్ నేమ్ లీక్ చేస్తున్నట్టు టాక్.
Bigg boss 6 : ఉదయం సుదీప ఎలిమినేట్ అయ్యిందని టాక్..
ఇక ఈ వారం కూడా అలాగే అయ్యింది. ఈ వారం సుదీప ఎలిమినేట్ అయిపోయినట్టు ఉదయం న్యూస్ వచ్చింది. దీంతో సోషల్ మీడియాలో పెద్ద చర్చే నడిచింది. సుదీప కూడా డేంజర్ జోన్‌లోనే ఉండటంతో అంతా అది నిజమేనని నమ్మేశారు. కానీ తరువాత అసలు న్యూస్ బయటకు వచ్చింది. ఈ వారం ఎలిమినేట్ అయ్యింది సుదీప కాదు.. ఆరోహి. ఆర్‌టీవీ ముందుగానే చెప్పినట్టు ఈ వారం ఆరోహి ఎలిమినేట్ అయ్యింది. గేమ్ ఆడుతుందని హౌస్‌లోకి తీసుకుంటే ఆమె సూర్య చుట్టూ తిరగడం తప్ప చేసిందేమీ లేదు.అది చాలదన్నట్టు మనిషి ముందొక మాట.. వెనకొక మాట. అవన్నీ గమనిస్తున్న ప్రేక్షకులకు ఆరోహి అంటేనే చిరాకేసింది. మొత్తానికి అమ్మడు బయటకు వచ్చేస్తోంది. ఇక సూర్య ఆట అయినా మెరుగుపడుతుందేమో చూడాలి.