ఈ మధ్య కాలంలో సిల్వర్ స్క్రీన్ మీద చాలా సినిమాలు బోల్తా కొడుతున్నాయి. ఎంత అద్భుతంగా ఉన్న మూవీ అయినా కూడా ప్రేక్షకులని థియేటర్ వైవు రప్పించడంలో మాత్రం తడబడుతుంది. టికెట్లు రేట్లు ప్రభావం సినిమా సక్సెస్ ని కూడా నిర్ధేశించే స్థాయికి ఇప్పుడు వచ్చేసింది అని తెలుస్తుంది. దిల్ రాజు నిర్మాణంలో విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా థాంక్యూ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది. ఈ సినిమా కథ పరంగా చూసుకుంటే అద్భుతంగా ఉందనే మాట వినిపించింది. ఇక నాగ చైతన్య కూడా ఈ సినిమా కూడామూడు విభిన్న రూపాలలో కనిపించే ప్రయత్నం చేశాడు. పారిస్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమా కోసం ఖర్చు కూడా బాగానే పెట్టారు. 23 కోట్ల బ్రేక్ ఈవెన్ తో ఈ మూవీ ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
ఇక క్లాసిక్ మూవీగా తెరకెక్కిన ఈ సినిమా ప్రతి ఒక్కరి జీవితానికి దగ్గరగా ఉంటుందని, అందరికి కనెక్ట్ అవుతుందని భావించారు. అయితే ఊహించని విధంగా థియేటర్ లో రిలీజ్ అయినా తర్వాత సినిమా ప్రేక్షకులని మెప్పించలేకపోయింది. ఇప్పటికే ఈ తరహా కథతో రవితేజ హీరోగా నా ఆటోగ్రాఫ్ స్వీట్ మెమొరీస్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా కూడా పాజిటివ్ టాక్ తెచ్చుకున్న రవితేజ కెరియర్ డిజాస్టర్ చిత్రాలలో అది కూడా ఒకటిగా మిగిలిపోయింది. ఈ సినిమా చాలా మందికి నచ్చుతుంది. అయితే థియేటర్ లో మాత్రం ఆడియన్స్ కి కనెక్ట్ కాలేదు. ఇక ఇప్పుడు నాగ చైతన్య కూడా ఇలా జీవితంలో జ్ఞాపకాలని అన్వేషించుకుంటూ ప్రయాణం చేసే కథగానే థాంక్యూ నడిచింది. అయితే కథనం పరంగా వీక్ గా ఉండటంతో ప్రేక్షకులని మెప్పించలేకపోయింది.
ఎమోషనల్ ఎలిమెంట్స్ కూడా అనుకున్న స్థాయిలో వర్క్ అవుట్ కాలేదనే టాక్ వినిపిస్తుంది. దర్శకుడు విక్రమ్ కె కుమార్ చాలా పేలవంగా సినిమా కథనాన్ని నడిపించాడనే మాట వినిపిస్తుంది. ఇక ఈ సినిమా మొదటి రోజు కేవలం 2.23 కోట్ల షేర్ ని మాత్రమే రాబట్టింది. ఇక సినిమా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే కచ్చితంగా 20 కోట్ల పైగా కలెక్ట్ చేయాలి. నాగ చైతన్య కెరియర్ లోనే మొదటి రోజు తక్కువ కలెక్షన్ వచ్చిన చిత్రంగా ఈ మధ్య కాలంలో థాంక్యూ నిలవడం గమనార్హం. మరి ఇలాంటి పరిస్థితిలో లాంగ్ రన్ లో ఎంత కాలం ఈ మూవీ ఆడియన్స్ ని మెప్పిస్తుంది అనేది చూడాలి. నాగ చైతన్యకి వరుసగా రెండు హిట్స్ తర్వాత దీంతో ఫ్లాప్ వచ్చేలా ఉందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తున్న మాట.