Thamma Reddy:ఓం రౌత్ దర్శకత్వంలో ప్రభాస్ రాముడిగా, కృతి సనన్ సీతగా నటిస్తున్న సినిమా ఆదిపురుష్. ఈ సినిమాకు సంబంధించి అప్డేట్స్ తెల్సిన దగ్గర్నించి ప్రభాస్ ఫ్యాన్స్ మాత్రమే కాకుండా దేశంలోని సినిమా ప్రేక్షకులు అంతా ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. ఎట్టకేలకు ఈ సినిమా టీజర్ విడుదల చేశారు. ఆ టీజర్ చూశాక ప్రేక్షకులు ఎన్నో రకాల కామెంట్లు చేశారు.
ఆ టీజర్ ను చూసినంత సేపు యానిమేషన్ కార్టూన్స్ చూస్తున్నట్టు అనిపించింది అని అందరూ అనుకున్నారు. ఆ టీజర్ లో ప్రభాస్ లుక్ బాలేదు అంటూ ఎన్నో విమర్శలు చేశారు. అయితే ఆ తర్వాత చిత్ర బృందం దీని పై స్పందించి 3d లో ఈ సినిమా బాగుంటుంది అని 3d లో టీజర్ ను రిలీజ్ చేశారు. దీని చూసిన ప్రభాస్ అభిమానులు ఫుల ఖుష్ అయ్యారు.
అయితే దర్శక నిర్మాత తమ్మారెడ్డి భరద్వాజ కూడా ఈ విషయం పై స్పందించారు. తన యూట్యూబ్ ఛానల్ ద్వారా ఆదిపురుష్ టీజర్‌పై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఆయన మాట్లాడుతూ, ఆదిపురుష్ ట్రైలర్ చూశాను.
కానీ ఆ ట్రైలర్ చూసిన తర్వాత చాలా డిజప్పాయింట్‌గా అనిపించింది.నాకు యానిమేషన్ సినిమాలా అనిపించింది. దీనిపై ట్రోలింగ్ కూడా చేస్తున్నారు. ప్రెస్‌మీట్ లో ప్రొడ్యూసర్, డైరెక్టర్, హీరో సినిమాని 3డీలో చూడాలని చెబుతున్నారు.3డీ అయినా 4డీ అయినా యానిమేషన్‌కి లైవ్‌కి తేడా ఉంటుంది.
3డీలో పక్షులు, రాక్షసులు మీదకు వచ్చినట్లు కనిపిస్తుంది. జనం గోల ఏంటంటే అది యానిమేషన్ సినిమాలాగా ఉందని,రజినీకాంత్ తీసిన కొచ్చాడియన్‌లా ఉందని రాముడు, రావణాసురుడు, హనుమంతుడు గెటప్‌ల మీద కూడా చాలా ట్రోలింగ్ నడిచింది.రాముడిని దేవుడిగా కొలిచే దేశంలో ఆయన గెటప్‌ని మార్చేయడం విచిత్రంగా ఉంది.
Thamma Reddy: ఆది పురుష్ సినిమాపై ఫైర్ అయిన తమ్మారెడ్డి..
రావణాసురుడు కూడా బ్రాహ్మణుడు.ఆయనకు కూడా దేవాలయాలు ఉన్నాయి.అయితే 20 రోజుల్లో అంతా మారిపోతుంది అంటున్నారు.నిజంగా ఆ రిపేర్లు ఏవో చక్కగా చేస్తే మంచిదే.సినిమా మంచిగా రావాలనే ట్రోల్స్ చేస్తున్నారు.సినిమాని అల్లరి చేయాలని చేయడం లేదు. ఆదిపురుష్ సినిమాకి ఆల్ ది బెస్ట్ అంటూ తమ్మారెడ్డి వ్యాఖ్యానించారు.