ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకున్నారు. అయితే కొంతమంది మాత్రం కాపీ క్యాట్ అంటూ హేళన చేసినా ఆయన వర్క్ పై నెగిటివ్ కామెంట్లు చేసినా సరే మ్యూజిక్, బిజీఎం వల్లే సక్సెస్ సాధించిన సినిమాలు కూడా ఉన్నాయని చెప్పవచ్చు. ఇదిలా ఉండగా గత రెండు రోజులుగా తమ గురించి వార్తలు చాలా వైరల్ అవుతున్నాయి. ఆ వార్తలు థమన్ ను కించపరిచే విధంగా ఉండడంతో ఆయన కెరియర్ దెబ్బతీసే విధంగా కూడా ఉన్నాయని చెప్పవచ్చు.

తాజాగా థమన్ మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్ కాంబోలో వస్తున్న గుంటూరు కారం సినిమాకి సంగీత దర్శకుడిగా పని చేస్తున్నారన్న విషయం తెలిసిందే .అయితే తాజాగా థమన్ ను తప్పించారని ఆయన స్థానంలో జీవి ప్రకాష్ కుమార్ ను తీసుకోబోతున్నారని థమన్ పనితీరు నచ్చకపోవడం వల్లే మహేష్ ఈ నిర్ణయం తీసుకున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరొకవైపు మహేష్ బాబు బ్రో మూవీ కోసం తమన్ రూ.3.5 కోట్ల పారితోషకం తీసుకున్నారని అంతే కాదు ఇతర ఖర్చులకోసం నిర్మాతకు మరో రూ .60 లక్షలు బిల్లు పంపించారని.. ఇప్పటికీ కూడా బ్రో సినిమాకు సంబంధించి ట్యూన్ ఇంకా ఫైనలైజ్ కాలేదని వార్తలు వినిపిస్తున్నాయి.
ఇలా రకరకాల వార్తలు వైరల్ అవుతున్న నేపథ్యంలో థమన్ ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నా స్టూడియో దగ్గర మజ్జిగ స్టాల్ ప్రారంభిస్తానని ఆయన ట్వీట్ లో పేర్కొన్నారు. ఆ మజ్జిగ తాగి తమ సమస్యను పరిష్కరించుకోవచ్చు అని కూడా ఆయన తెలిపారు.. అంతేకాదు నా సమయాన్ని నేను వృధా చేసుకోవాలని అనుకోవడం లేదని చాలా పని ఉందని తమన్ ట్వీట్ చేయడం ఇప్పుడు చాలా వైరల్ గా మారింది.