ప్రస్తుతం టాలీవుడ్ మోస్ట్ వాంటెడ్ మ్యూజిక్ డైరెక్టర్ గా మారిపోయిన తమన్ బ్యాక్ టు బ్యాక్ మూవీస్ చేస్తూ బాగా బిజీ అయిపోయారు.వరసగా తమన్ అందిపుచ్చుకుంటున్న అవకాశాలు చూస్తుంటే రానున్న కాలంలో తమన్ మిగతా మ్యూజిక్ డైరెక్టర్ లకు హార్డ్ టైం ఇవ్వబోతున్నాడనిపిస్తుంది.ప్రస్తుతం తమన్ టాలీవుడ్ లో చిరంజీవి గాడ్ ఫాదర్,అఖండ,ఎన్.బి.కే 107, భీమ్లా నాయక్,సర్కారు వారి పాట, రామ్ చరణ్ 15, దళపతి 66, గని,మహేష్ బాబు 28వ చిత్రం, థాంక్ యూ వంటి భారీ ప్రెస్టీజియస్ ప్రాజెక్ట్స్ చేస్తున్నారు.ఇవి చేస్తూ బిజీ అవ్వడం వల్లనే తమన్ కొత్తగా వచ్చిన కొన్ని చిత్రాలకు నో అని చెప్పారని సమాచారం.