ఇప్పుడు ఏ పార్టీలో చూసినా మునుగోడు ఉపఎన్నిక గురించే రచ్చ జరుగుతోంది. నల్లొండ జిల్లాలో ఎక్కడ చూసినా దీని గురించే చర్చించుకున్నారు. తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్ లో కూడా మునుగోడు ఉపఎన్నికల పెద్ద చర్చనీయాంశంగా మారింది. ఇద్దరు, ముగ్గురు రాజకీయ నేతలు కలిస్తే మునుగోడు ఉపఎన్నిక లేకుండా చర్చ ముగియడం లేదు. అంతగా మునుగోడు ఉపఎన్నికల తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. పార్టీలన్నీ ఇక్కడ గెలిచి వచ్చే ఎన్నికల్లో తమ వైపే ప్రజలు ఉన్నారని చెప్పుకోవాలని చూస్తున్నారు. జాతీయ నేతలు సైతం మునుగోడుకు వచ్చి ప్రచారం నిర్వహిస్తున్నారంటే.. మునుగోడు ఉపఎన్నికల ఎంత ప్రతిష్టాత్మకంగా పార్టీలన్నీ భావిస్తున్నాయో అర్థమవుతుంది. చావో.. రేవో అన్నట్లుగా పార్టీలన్నీ గెలుపే లక్ష్యంగా వ్యూహలు రచిస్తున్నాయి. వ
అయితే ఉపఎన్నికలు అనగానే.. ప్రలోభాల పర్వం మరింత ఎక్కువగా ఉంటుంది. డబ్బులు ఏరులై పారుతాయి. ఓటర్లకు పెద్ద మొత్తంలో డబ్బులు వెదజల్లుతారు. ధనబలం, అంగ బలం మొత్తం ఉపయోగిస్తారు. ఇక మద్యం అయితే విచ్చలవిడిగా సరఫరా చేస్తున్నారు. తాగినోడికి తాగినంత, బిర్యానీ ప్యాకెట్లు.. ఇలా ఉపఎన్నిక వచ్చిందంటే నియోజకవర్గంలో పండుగ వాతావరణం నెలకొంటుంది. వద్దన్నా సరే ఓటర్ల చేతుల్లోకి డబ్బులు, మద్యం వచ్చి పడుతుంది.
ఇప్పుడు మునుగోడులో కూడా డబ్బులు, మద్యం ఏరులై పారుతోంది. ఉపఎన్నికలకు ఇంకా నోటిఫికేషన్ రాలేదు. నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందనే దానిపై కూడా క్లారిటీ లేదు. అయితే ముందుగానే పార్టీలన్నీ అలర్ట్ అయ్యాయి. ఓటర్లను ఆకర్షించేందుకు ప్రయత్నిస్తున్నాయి. ప్రలోభాలకు ఇప్పటినుంచే తెరలేపాయి. ఒక్కో ఓటుకు ఒక్కో పార్టీ రూ.10 వేలు ఇస్తున్నట్లు ప్రచారం సాగుతోంది. టీఆర్ఎస్, కాంగ్రెస్ , బీజేపీ కలిసి ఒక్కో ఓటర్లకు రూ.30 వేల వరకు ఇస్తున్నాయి. ఇక వీటతో పాటు మద్యం కూడా సరఫరా చేస్తున్నాయి.
Munugode
ఇక ఎన్నికల నేపథ్యంలో మునుగోడులో కొత్త ఓటర్లు కూడా నమోదు చేసుకుంటున్నట్లు తెలిసింది. ఇతర ప్రాంతాల వాళ్లు కూడా ఇక్కడికి తమ ఓటును మార్పించుకుంటున్నారు. డబ్బుకు ఆశ పడో.. లేక మరోదైన కారణమో తెలియదు కాదు.. ఇతర ప్రాంతాల ఓటర్లు.. తమ ఓటును ఇక్కడకు మార్పించుకునేందుకు కొత్తగా దరఖాస్తులు పెట్టుకున్నట్లు అధికారులు చెుబుతన్నారు. మొత్తం ఆగస్టు 2 నుంచి సెప్టెంబర్ 2 వరకు 19 వేల కొత్త అప్లికేషన్స్ రాగా.. అందులో 9 వేల మంది ఇతర ప్రాంతాల వాళ్లు అని అ ధికారులు గుర్తించారు.