తెలుగు సీరియల్స్ ఇష్టపడే ప్రేక్షకులు నిత్యం పెరుగుతూ ఉన్నారు. ఒకప్పుడు ఫీమేల్ సెంట్రిక్ గా సీరియల్స్ కథలునడిచేవి. అయితే మారుతున్న కాలంతో పాటు సీరియల్స్ కథల విధానంలో విధానంలో కూడా మార్పులు వస్తున్నాయి. లవ్ స్టోరీలతో పాటు, పాజిటివిటీ, రిలేషన్ షిప్ ని పెంచే కథలని తెలుగు సీరియల్ దర్శకులు ఆవిష్కరిస్తున్నారు. ఈ నేపధ్యంలో కొన్ని ప్రత్యేకమైన సీరియల్స్ లో టెలివిజన్ తో పాటు ఓటీటీలో కూడా ఆడియన్స్ ఉన్నారు. అలాంటి వాటిలో ముఖ్యంగా కనిపించేవి కార్తీక దీపం, తరువాత గుప్పెడంత మనసు, రాధమ్మ కూతురు, ఇంటింటి గృహలక్ష్మి సీరియల్స్ ఉండటం విశేషం. ఈ సీరియల్స్ కి ప్రస్తుతం మంచి ఆదరణ ఉంటుంది. వీటిలో కార్తీక దీపం, గుప్పెడంత మనసు సీరియల్స్ టాప్ రేటింగ్ లో దూసుకుపోతున్నాయి.
ఇక కార్తీక దీపం సీరియల్ తో సమానమైన హైప్ ని రాధమ్మ కూతురు సీరియల్ సొంతం చేసుకుంటుంది. ఇక ఈ సీరియల్స్ కి సంబందించిన ప్రోమోలని యుట్యూబ్ లో వీక్షించే వారి సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది.ఇదిలా ఉంటే ఓర్ మ్యాక్స్ నిర్వహించిన సర్వే ఇండియన్ వైడ్ గా మోస్ట్ పాపులర్ తెలుగు సీరియల్ ఫిక్షన్ క్యారెక్టర్స్ జాబితాలో మొదటి స్థానంలో కార్తీక దీపం సీరియల్ నుంచి దీప పాత్ర ఉండటం విశేషం. ఐదేళ్లు అయిన ఆ పాత్రకి ప్రేక్షకులలో ఉన్న గుర్తింపు మాత్రం తగ్గలేదని దీనిని బట్టి అర్ధం చేసుకోవచ్చు.
తర్వాత రెండో స్థానంలో గుప్పెడంత మనసు సీరియల్స్ రిషి పాత్రకి విశేషమైన ఫ్యాన్స్ ఉన్నారు. రిషి క్యారెక్టర్ ని ఆడవాళ్లు మాత్రమే కాకుండా సీరియల్స్ చూసే మగవారు కూడా ఇష్టపడుతున్నారు. దీని తర్వాత గుప్పెడంత మనసు సీరియల్ లో వసుధార పాత్రకి ప్రేక్షకులు బాగా కనెక్ట్ అయ్యారని ఈ సర్వే బట్టి తెలుస్తుంది. అలాగే ఇంటింటి గృహలక్ష్మిలో తులసి పాత్రకి, రాధమ్మ కూతురు సీరియల్ లో అక్షర పాత్రకి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది.