క్రిష్ దర్శకత్వంలో పవన్ కళ్యాణ్ హీరోగా తెరకెక్కుతున్న పీరియాడికల్ చిత్రం హరిహర వీరమల్లు. ఈ మూవీ షూటింగ్ ఎప్పుడో మొదలైంది. ఇప్పటికే సగానికిపైగా షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యింది. అయితే పవన్ కళ్యాణ్ పొలిటికల్ ప్రయాణాలు, కార్యక్రమాల వలన మధ్యలో ఆగుతూ వెళ్తుంది. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకోవాలని అనుకున్న జనసేన పార్టీ వ్యవహారాల కారణంగా పవన్ కళ్యాణ్ రెగ్యులర్ గా కాల్ షీట్స్ ని ఇవ్వలేకపోతున్నారు. అయితే ఈ సినిమా నుంచి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా వచ్చిన గ్లిమ్ప్స్ సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అయిన సంగతి తెలిసిందే.
పవన్ కళ్యాణ్ పేరు కనిపిస్తేనే సోషల్ మీడియాలో ఆ రోజు షేక్ అయిపోతుంది. పవర్ స్టార్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఆ స్థాయిలో ఉంటుంది. ఇక హరిహర వీరమల్లు సినిమా పాన్ ఇండియా స్థాయిలో భారీ బడ్జెట్ తో ఇప్పటి వరకు చేయనటువంటి సరికొత్త కథ, పాత్రతో వస్తుంది. దీంతో ఈ సినిమాపై భారీ హైప్ క్రియేట్ అయ్యింది. జనసేన పోలికల్ యాత్రని అక్టోబర్ నుంచి స్టార్ట్ చేయాలని అనుకున్న మళ్ళీ ఏవో కారణాల వలన పోస్ట్ ఫోన్ చేశారు. అయితే హరిహర వీరమల్లు షూటింగ్ కంప్లీట్ చేసి తరువాత పూర్తి స్థాయిలో రాజకీయ ప్రయాణంపై దృష్టి పెట్టాలని సన్నిహితులు ఇచ్చిన సలహా మేరకే పవన్ కళ్యాణ్ ఈ నిర్ణయం తీసుకున్నారని తెలుస్తుంది.
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ వ్యక్తిగత కారణాలతో అమెరికా వెళ్లారు. అక్కడి నుంచి వచ్చిన వెంటనే అక్టోబర్ మొదటి వారంలో హరిహర వీరమల్లు షూటింగ్ లో జాయిన్ అయ్యే అవకాశం ఉందనే మాట వినిపిస్తుంది. ముందుగా క్రిష్ కి తనకి సంబందించిన సన్నివేశాలు కంప్లీట్ చేయాలని పవన్ సూచించినట్లు తెలుస్తుంది. ఈ నేపధ్యం క్రిష్ కూడా అలాగే షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఇక ఈ ఏడాది ఇండియన్ వైడ్ గా తెలుగు ప్రజలు చూడటం కోసం ఎక్కువగా కోరుకునే సినిమాల జాబితాలో హరిహరవీరమల్లు కూడా ఉండటం విశేషం. దీంతో పాటు పుష్ప2, ఆదిపురుష్, సలార్ చిత్రాలకి సంబందించిన న్యూస్ తెలుసుకోవడానికి తెలుగు సినీ అభిమానులు ఆసక్తి చూపిస్తున్నారు.