Telangana: తెలంగాణలో రసవత్తరంగా సాగుతున్న మునుగోడు ఉప ఎన్నిక వేళ కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అధికార టీఆర్ఎస్, బీజేపీల మధ్య నేతలు జంపింగ్ లు చేస్తున్నారు. ఒక పార్టీకి చెందిన నేతలు మరో పార్టీలోకి మారుతున్నారు. టీఆర్ఎస్ ఎంపీ బూర నర్సయ్య గౌడ్ టీఆర్ఎస్ ను వీడి బీజేపీలో చేరడం సంచలనంగా మారింది.
దీనికి కౌంటర్ గా బీజేపీలో ఉన్న దాసోజు శ్రవణ్, స్వామి గౌడ్ లను తమ పార్టీలోకి చేర్చుకుంది టీఆర్ఎస్. దీంతో ఇప్పుడు టీఆర్ఎస్ కు మరో షాక్ ఇవ్వాలని బీజేపీ ప్లాన్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. అందుకు గాను టీఆర్ఎస్ కు చెందిన ఎంపీని తమ పార్టీలోకి ఆహ్వానించడానికి అంతా సిద్ధమైనట్లు సమాచారం అందుతోంది.
ప్రస్తుతం టీఆర్ఎస్ లో ఉన్న సదరు ఎంపీ బడా వ్యాపార వేత్త అని, ఆయనకు ఢిల్లీలో సత్సంబంధాలు ఉన్నాయని తెలుస్తోంది. పైగా ఆ ఎంపీ రెడ్డి సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిగా తెలుస్తుండగా.. అతడిని బీజేపీలోకి తీసుకుంటే టీఆర్ఎస్ కు ధీటైన సమాధానం ఇచ్చినట్లు అవుతుందని, మునుగోడులో గెలుపుకు మంచి ఉత్సాహం లభిస్తుందని బీజేపీ నేతలు ప్లాన్ చేస్తున్నారట.
Telangana:
అటు ఢిల్లీలో ఆ ఎంపీతో బీజేపీ పెద్దలు లాబీయింగ్ చేస్తున్నారని తెలుస్తుండగా.. ప్రస్తుతం బీజేపీ చేరికల కమిటీ చైర్మన్ గా ఉన్న ఈటల రాజేందర్ తో కూడా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. ఈటల రాజేందర్ తో ఆ ఎంపీకి మంచి సంబంధాలు ఉన్నాయని, వాటిని ఉపయోగించుకొని అతడిని పార్టీలోకి ఆహ్వానించేందుకు రంగం సిద్ధం చేసినట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.