Telangana BJP: తెలంగాణలో అధికార టీఆర్ఎస్, బీజేపీ ప్రభుత్వ వైరం తారాస్థాయికి చేరుకుంటుంది. చివరికి మీడియా సంస్థలను బ్యాన్ చేసే దగ్గరకు వెళ్లిపోయింది. ప్రతి పార్టీకి తమకు అనుకూలంగా మీడియా సంస్థలను సొంతగా ఏర్పాటు చేసుకుంటున్నాయి. మరికొన్ని పార్టీలు ఇన్‌డైరెక్ట్ గా ఫండింగ్ చేస్తూ ఉంటాయి. ప్రస్తుతం తెలంగాణలో టీఆర్ఎస్ కు సొంత మీడియా ఛానెల్ టీ న్యూస్ తో పాటు పత్రిక నమస్తే తెలంగాణ, డిజిటల్ మీడియాకు సంబంధించి తెలంగాణ టుడే అనే వెబ్ సైట్, ఈ-పేపర్ ఉంది. ఇక బీజేపీకి వస్తే వీ6తో పాటు మరికొన్ని ఛానెళ్లు సపోర్ట్ గా ఉన్నాయి.
అయితే తాజాగా నిర్మలా సీతారామన్ నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర మెయిన్ ఆఫీస్ లో ప్రెస్ మీట్ ఏర్పాటు చేశారు. కేంద్రమంత్రి ప్రెస్ మీట్ కావడంతో దాదాపుగా ఈ మీడియా సమావేశాన్ని కవర్ చేసేందుకు అన్ని మీడియా సంస్థలు వచ్చాయి. కానీ ప్రెస్ మీట్ కు కొన్ని నిమిషాల ముందు నిర్మలా సీతారామన్ ప్రెస్ మీట్ ను కవర్ చేసేందుకు బీజేపీ ఆఫీస్ కు వచ్చిన టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే విలేఖర్లను బీజేపీ నేతలు వెనక్కి తిరిగి వచ్చారు. ఈ మూడు మీడియా సంస్థల జర్నలిస్టులకు అనుమతి నిరాకరించారు. దీంతో అక్కడికి వచ్చిన జర్నలిస్టులు వెనక్కి వెళ్లిపోయారు.
దీనిని బట్టి చూస్తుంటే ఈ మూడు మీడియా సంస్థలను బీజేపీ బ్యాన్ చేసినట్లు అర్థమవుుతంది. టీఆర్ఎస్ సొంత మీడియా అయిన ఈ మూడు సంస్థలు బీజేపీకి వ్యతిరేకంగా వార్తలు రాస్తాయి. అందుకనే బీజేపీ ప్రెస్ మీట్లకు అనుమతి నిరాకరించి బ్యాన్ విధించారు. తెలంగాణ నిర్మలా సీతారామన్ రెండు రోజుల పర్యటన ముగియడంతో స్టేట్ బీజేపీ ఆఫీస్ లో ఆమె మీడియా సమావేశం పెట్టారు. ఈ మీడియా సమావేశంలో టీఆర్ఎస్ కు చెందిన మీడియా సంస్థల ప్రతినిధులు లేనిపోని ప్రశ్నలు అడిగి నిర్మలాను తికమక పెట్టే అకశముంది. అందుకు టీ న్యూస్, నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేను రానివ్వలేదని తెలుస్తోంది.
Telangana BJP:
రేషన్ షాపుల్లో ప్రధాని మోదీ ఫొటో పెట్టనందుకు కలెక్టర్ పై నిర్మలా సీతారామన్ ఆగ్రహం వ్యక్తం చేయడం వివాదాస్పదంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వ పథకాల్లో కేంద్రం నిధులు ఉంటే మోదీ ఫొటో ఎందుకు పెట్టరంటూ ఆమె నిలదీశారు. సీఎం కేసీఆర్ కేంద్ర నిధులతో పథకాలు నడిపిస్తే మోదీ పెట్టడం లేదని, తన ఫొటో పెట్టుకుని ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వమే సొంత డబ్బులతో పథకాలు ఇస్తుందనేలా కేసీఆర్ తన ఫొటోతో ప్రచారం చేసుుకుంటున్నారని నిర్మలా మండిపడ్డారు. అయితే నిర్మలా వ్యాఖ్యలపై కేటీఆర్ కౌంటర్ ఇవ్వడంతో బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఇది ఒక వివాదంగా మారిపోయింది.