తేజస్వి మదివాడ… టాలీవుడ్ లో ఈ పేరు తెలియని వారు ఉండరు. క్యారెక్టర్ ఆర్టిస్ గా కెరియర్ ప్రారంభించి తరువాత హీరోయిన్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకుంది. అందరి తెలుగు అమ్మాయిల తరహాలో మడికట్టుకొని కూర్చోకుండా బోల్డ్ గా కనిపించడానికి కూడా ఏ మాత్రం సంకోచించని తేజస్వికి ఆ స్థాయిలో హీరోయిన్ గా సరైన అవకాశాలు అయితే రాలేదు. ఏదో చిన్న హీరోలతో అడపాదడపా సినిమాలు చేస్తున్న పెద్ద హీరోల సరసన మాత్రం తేజస్విని హీరోయిన్ గా తీసుకోవడం లేదు. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫోటోలతో సందడి చేసిన ఈ అమ్మడుకి అవకాశాలు మాత్రం చాలా తక్కువగానే ఉన్నాయని చెప్పాలి.
వస్తున్న అవకాశాలు కూడా ఏదో హీరోయిన్ ఫ్రెండ్, సిస్టర్ లాంటి పాత్రలే కావడంతో వాటిపై ఆమె ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుతం తేజస్వి నటించిన కమిట్మెంట్ అనే వెబ్ ఫిలిం రిలీజ్ కి రెడీగా ఉంది. ఇక ఈ సినిమా ప్రమోషన్ లో భాగంగా తెలుగు హాట్ బ్యూటీ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండస్ట్రీలో కమిట్మెంట్ అడిగేవాళ్ళు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఉన్నారని కామెంట్ చేసింది. అయితే ఇండస్ట్రీలో ఇప్పటి వరకు తనని ఎవరు కమిట్మెంట్ అడగలేదని చెప్పుకొచ్చింది.
ఈ సందర్భంగా శ్రీరెడ్డి గురించి కూడా తేజస్వి ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేసింది. శ్రీరెడ్డి చేసిన పనులన్నీ ముందు చేసి తరువాత నీతి కబుర్లు చెప్పడం చాలా విడ్డూరంగా ఉందని ఆమె పేర్కొంది. ఆమె గురించి కమిట్మెంట్ సినిమాలు చర్చించడం జరిగిందని తెలిపింది. మహిళా సాధికారిత మీద ఈ సినిమాలో చర్చించినట్లు చెప్పింది. అయితే అది కాస్తా బోల్డ్ గా ఉంటుందని కొన్ని విషయాలు చెప్పాల్సిన విధంగా చెబితేనే అందరికి రీచ్ అవుతుందని తేజస్వి చెప్పడం విశేషం.