టాలీవుడ్ హీరోయిన్ తేజస్వి మాదివాడ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. బోల్డ్ బ్యూటీగా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపుని సొంతం చేసుకున్న నటి తేజస్వి మదివాడ. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించిన తేజస్వి తర్వాత ఐస్ క్రీం అనే మూవీతో హీరోయిన్ గా టర్న్ తీసుకుంది. రాంగోపాల్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో బోల్డ్ క్యారెక్టర్ లో కనిపించి అందరినీ మెస్మరైజ్ చేసింది. తర్వాత కూడా హీరోయిన్ గా సినిమాలు చేస్తూ రాణిస్తుంది. తాజాగా కమిట్మెంట్ అనే సినిమాతో ఈ భామ ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
చాలా గ్యాప్ తర్వాత మళ్ళీ స్క్రీన్ పై కనిపించే ఈ అమ్మడు ఆసక్తికరమైన విషయాలను తన గురించి పంచుకుంది. బిగ్ బాస్ సీజన్ 2లో తేజస్వి మదివాడ పార్టిసిపేట్ చేసిన ఈ విషయం అందరికీ తెలిసిందే. ఆ సీజన్లో కౌశల్ విన్నర్ గా నిలిచాడు. అయితే బిగ్ బాస్ హౌస్ లో ఉన్నప్పుడు తేజస్వి, కౌశల్ మధ్య చాలా గొడవలు జరుగుతూ ఉండేవి. ఇక నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా తేజస్వి మదివాడ చాలా సందర్భాల్లో కౌశల్ పై విమర్శలు చేసింది. తేజస్వి బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చినప్పటి నుంచి కౌశల్ ఫ్యాన్స్ తనని విపరీతంగా సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. మీమ్స్ క్రియేట్ చేస్తూ వేధింపులకు గురి చేశారు.
ఈ విషయాన్ని ఆమె స్వయంగా చెప్పింది. కౌశల్ ఆర్మీ వేధింపులు భరించలేక చాలా చాలా ఆవేదనకు గురైనట్లు తెలిపింది. వారి కారణంగా ఒత్తిడిలోనై కూడా వ్యసనాలకు బానిసైనట్లు చెప్పింది. ఇక వేధింపులకి దూరంగా ఉండాలని రెండేళ్లు విదేశాల్లో ఉన్నానని తెలిపింది. తనను వేధించిన కౌశల్ కౌశల్ ఆర్మీ ఏం సాధించారో తనకు తెలియదని చెప్పింది. ఇక కౌశల్ కూడా కెరీర్ లో పెద్దగా సక్సెస్ అయింది ఏమీ లేదని విమర్శలు చేసింది. మొత్తానికి కౌశల్ ఆర్మీ కారణంగా తన కెరీర్లో సినిమాలు కూడా కొంతకాలం దూరమై ఆత్మన్యూనతతో బ్రతకాల్సి వచ్చిందని చెప్పింది.