Tejasswi Prakash : ఎంచుకునే ప్రతి లుక్‌తో ఫ్యాషన్ ప్రియులకు ఫ్యాషన్ స్టేట్‌మెంట్స్ ఇస్తుంది బుల్లితెర ముద్దుగుమ్మ నాగిని బ్యూటీ తేజస్వి ప్రకాష్. తన అభిమానులను గ్లామరస్ లుక్స్‌తో ఎలా ఆశ్చర్యపరచాలో ఈ భామకు బాగా తెలుసు. తాజాగా అద్భుతమైన కార్సెట్ గౌన్‌ను ధరించి అందరిని మెస్మరైజ్ చేసింది. లేటెస్ట్ ఫ్యాషన్ ఫోటో షూట్ కోసం ఈ నటి ప్రముఖ క్లాతింగ్ బ్రాండ్ విర్షితే నుంచి స్ట్రక్చర్డ్ కార్సెట్ గౌన్‌ను ఎంచుకుంది.

స్ట్రక్చర్డ్ స్లీవ్స్, కార్సెట్ టాప్, బాడీకాన్ ఫిట్‌తో డిజైన్ చేసిన ఈ అవుట్ ఫిట్ తేజస్వి బాడీ స్ట్రక్చర్‌కు కలర్ టోన్‌కు బాగా సెట్ అయ్యింది . గౌను ముందు భాగంలో వచ్చిన డ్రమాటిక్ స్లిట్ తేజస్వి అందాన్ని మరింత ఎలివేట్ చేస్తోంది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా గ్లామరస్ మేకప్ వేసుకుని ఫ్యాన్స్‌ను ఫిదా చేసింది తేజస్వి ప్రకాష్.

Tejasswi Prakash : ఈ డార్క్ గ్రీన్ బాడీకాన్ అవుట్‌ఫిట్‌తో దిగిన హాట్ హాట్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ చిన్నది. పోస్ట్ చేసిన క్షణాల్లోనే అభిమానులు కామెంట్ల వర్షం కురిపించారు. ఆమె అందాన్ని కొనియాడారు . తేజస్వికి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింది ఉంది. అందుకే ఆమె ఫాలోవర్స్‌ను ఇంప్రెస్ చేయాలన్న ఉద్దేశంతో ఎప్పటికప్పుడు అప్‌డేటెడ్ ఫ్యాషన్‌ను ఫాలో అవుతూ అదిరిపోయే అవుట్‌ఫిట్స్‌లో ఫోటో షూట్‌లు చేస్తూ హాట్ నెస్ తో చంపేస్తుంది.

ఈ అవుట్ ఫిట్ పిక్స్ కూడా ప్రస్తుతం నెట్‌లో వైరల్ అవుతున్నాయి. డ్రెస్‌కి సూట్ అయ్యేలా ఆమె కనులకు షిమ్మరింగ్ ఐ ష్యాడో వేసుకుంది. బుగ్గలను హైలైట్ చేసి పెదాలకు డీప్ రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని తన రూపాన్ని సంపూర్ణంగా మార్చుకుంది. చెవులకు బంగారపు ఇయర్‌రింగ్స్, పాదాలకు బ్లాక్ స్ట్రాపీ హీల్స్ వేసుకుని తన లుక్‌ను పెర్ఫెక్ట్‌గా మార్చుకుంది.

తేజస్వి ప్రకాష్ సాలిడ్ కలర్స్‌లోనూ అద్భుతంగా కనిపిస్తుంది. ఈ బ్యూటీ మ్యూట్ టోన్‌లను కూడా ధరించి ఫ్యాషన్‌లో కొత్త ట్రెండ్‌ను సెట్ చేస్తుంటుంది. ఈ మధ్యనే క్లాతింగ్ లేబుల్ బ్రాండ్ హెరిన్ నుంచి మోనోక్రోమ్ అవుట్‌ఫిట్‌ను ఎన్నుకుని ఆ అవుట్‌ఫిట్‌తో హాట్ హాట్ ఫోజులు ఇచ్చి అభిమానులను తన లుక్స్‌తో కట్టిపడేసింది. బాడీ హగ్గింగ్ ఫిట్‌తో , కార్సెట్ డీటైల్స్‌తో వన షోల్డర్ స్టైల్‌లో ఉన్న ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్ గా కనిపించింది తేజస్వి ప్రకాష్.

రీసెంట్‌గా డిజైనర్ లేబుల్ జాన్ అండ్ అనంత్ కలెక్షన్స్ నుంచి ఓ బాడీకాన్ డ్రెస్‌ను ఎన్నుకుని అదిరిపోయే ఫోటో షూట్ చేసింది. ఫిష్క ట్‌తో వచ్చిన బాటమ్, రఫెల్ డీటైల్స్‌తో డిజైన్ చేసిన స్లీవ్స్ లో తేజస్వి ఎంతో బోల్డ్ గా అందంగా కనిపించింది. ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తేజస్వి చెవులకు స్టేట్‌మెంట్ ఇయర్‌రింగ్స్, చేతి వేళ్లకు సిల్వర్ ఉంగరాలను పెట్టుకుంది. కనులకు స్మోకీ ఐష్యాడో , మస్కరా దిద్దుకుని పెదాలకు న్యూడ్ బ్రౌన్ టింట్ లిప్‌స్టిక్ పెట్టుకుని అదరగొట్టింది.
