Teeth pain: పళ్ల సమస్య చాలా మందికి ఉంటుంది. దంత సౌందర్యం ఉంటే బయట సమాజంలోకి వెళ్లినప్పుడు సంపూర్ణంగా నవ్వగలుగుతారు. ఆహారం నమిలి మింగడానికి పళ్ల ఆరోగ్యం చాలా అవసరం. చాలా మందికి పంటి నొప్పి బాధిస్తూ ఉంటుంది. చిగుళ్ల సమస్య కూడా అనేక మందిని ఇబ్బంది పెడుతుంటుంది. సరిగా బ్రష్ చేయాలన్నా కూడా అల్లాడుతుంటారు. ఇలాంటి వారు కొన్ని టిప్స్ పాటించడం వల్ల నోట్లో సమస్యను దూరం చేసుకోవచ్చు.
దంతాలు చక్కగా ఉన్నప్పటికీ వాటిని సక్రమంగా మెయిన్ టెన్ చేసుకోకపోతే ఇబ్బందులు తప్పవు. జాగ్రత్తలు తీసుకోకపోతే టీత్ పుసుపు రంగులోకి మారతాయి. నలుగురిలో కలిసినప్పుడు నవ్వాలన్నా ఇబ్బంది పడతారు. పళ్లను ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి. చిగుళ్ల ఆరోగ్యంపై కూడా శ్రద్ధ పెట్టాలి. ఏది పడితే అది తినడం వల్ల, లేదంటే ప్రమాదాల్లో ఏవైనా దెబ్బలు తగడం వల్ల పళ్లు దెబ్బతింటాయి.
పళ్లు ఆరోగ్యంగా ఉండాలంటే చిగుళ్ల పటిష్టత ముఖ్యం. దంతాల ఇన్ఫెక్షన్లు, పుచ్చిపోవడం, దంతాల్లో పగుళ్లు, చిగుళ్ల వాపు లాంటి సమస్యలు ఒకసారి మొదలైతే అంత సులభంగా తగ్గవు. నొప్పి తగ్గిపోవాలంటే దంత వైద్యులను సంప్రదించాల్సిందే. అయతే, డెంటిస్టును వద్దకు వెళ్లాలన్నా కొందరికి భయమే. లేనిపోనివి చెప్పి పళ్లు పీకేస్తారనే భయంతో చాలా మంది అటువైపు వెళ్లడానికే ఇష్టపడరు.
Teeth pain: ఇంట్లోనే పళ్ల సమస్యకు ఇలా చెక్ పెట్టండి..
భరించలేని పంటి నొప్పి వచ్చిన సందర్భాల్లో ఇంట్లోనే కొన్ని పద్ధతులు పాటించి ఉపశమనం పొందవచ్చు. కాస్త ఉప్పును లేదా మిరియాల పొడిని తీసుకొని పంటి నొప్పి ఉన్న ప్రాంతాల్లో పూసుకోవాలి. ఇలా చేస్తే తక్షణం నొప్పి నుంచి రిలీఫ్ ఇస్తుంది. పంటి నొప్పి మరీ ఎక్కువగా ఉన్న సమయంలో వేడి నీటిని తీసుకొని అందులో ఓ చిటికెడు సాల్ట్ వేయాలి. ఆ నీటిని ఓ పదినిమిషాలు నోట్లో పుక్కిలించాలి. రోజులో ఎన్ని సార్లు వీలైతే అన్ని సార్లు ఇలా చేస్తే క్రిములు నశిస్తాయి. బిగ్ రిలీఫ్ ఇస్తుంది.