Team India: టీమిండియా ఈసారి టీ20 వరల్డ్ కప్ ను సొంతం చేసుకోవడానికి సిద్ధమైపోయింది. ఇందుకుగాను ఇప్పటికే ఆస్ట్రేలియాకు చేరుకున్న టీమిండియా వార్మప్ మ్యాచ్ లో ఆస్ట్రేలియా మీద పైచేయి సాధించింది. 13 పరుగుల తేడాతో ఆస్ట్రేలియా మీద టీమిండియా విజయం సాధించింది. ఇక ఈ మ్యాచ్ లో టీమిండియా ప్లేయర్లు అంతా బాగానే ఆడినా.. ఒక క్రికెటర్ గురించి మాత్రం ఇప్పుడు చర్చ మొదలైంది.
ఈ సంవత్సరం ఎలాగైనా టీ20 వరల్డ్ కప్ ని సొంతం చేసుకోవాలని తహతహ లాడుతున్న టీమిండియాలో.. ఒక క్రికెటర్ మీద మాత్రం ఎక్కడో అనుమానాలు ఉన్నాయి. ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో హర్షల్ పటేల్ 4 ఓవర్లలో 49 పరుగులు ఇచ్చి ఒక వికెట్ తీశాడు. ఇదే మ్యాచులో భువనేశ్వర్ కుమార్ 4 ఓవర్లలో 26 పరుగులిచ్చి 2 వికెట్లు తీస్తే, ఫాస్ట్ బౌలర్ అర్ష్‌దీప్ సింగ్ 3 ఓవర్లలో 6 పరుగులు మాత్రమే ఇచ్చి 3 వికెట్లు పడగొట్టాడు. లెగ్ స్పిన్నర్ యుజ్వేంద్ర చాహల్ కూడా 4 ఓవర్లలో 15 పరుగులిచ్చి 2 వికెట్లు తీశాడు.
ఇలా చూస్తే ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచులో మన బౌలర్లు అందరూ అదరగొట్టగా.. హర్షల్ పటేల్ మాత్రం ఎక్కువ పరుగులు ఇచ్చి, ఒక్క వికెట్ మాత్రమే తీయడం అభిమానులకు అనుమానం కలిగిస్తోంది. సౌతాఫ్రికాతో జరిగిన సిరీస్ లో హర్షల్ పటేల్ ప్లాఫ్ అయ్యాడు. అతను 10 ఎకానమీతో 3 మ్యాచ్‌ల్లో భారీగా పరుగులు ఇచ్చాడు. అంతేకాదు కేవలం 2 వికెట్లు మాత్రమే తీయగలిగాడు.
టీ20 మ్యాచులు అంటేనే పరుగుల వరద ఉంటుంది. బ్యాట్స్ మెన్ కి బౌలర్ వేస్తున్న బాల్ కాస్త అనుకూలంగా అనిపిస్తే చాలు చిదకబాదే పరిస్థితి ఉంటుంది. ఇలాంటి నేపథ్యంలో హర్షల్ పటేల్ గ్రాఫ్ చూస్తే.. ఇప్పటివరకు 23 మ్యాచ్‌లలో 22 ఇన్నింగ్స్‌లలో 27 సగటుతో 26 వికెట్లు తీశాడు. 25 పరుగులకు 4 వికెట్లు తీయడం ఇప్పటి వరకు హర్షల్ పటేల్ బెస్ట్ పర్ఫామెన్స్. ఇక అతడి ఎకానమీ చూస్తే 9.20గా ఉంది. అంటే ఒక ఓవర్ కి దాదాపు పది పరుగులు ఇస్తున్నాడు.
Team India:
ఇప్పుడు టీమిండియా అభిమానులకు ఇదే భయం కలిగిస్తోంది. మిగిలిన టీమిండియా బౌలర్లు తక్కువ రన్స్ ఇస్తూ.. మంచి వికెట్లను పడగొడుతుంటే హర్షల్ పటేల్ మాత్రం ఎక్కువ రన్స్ ఇస్తూ, తక్కువ వికెట్లు తీస్తున్నాడు. దీంతో ఈసారి టీ20 వరల్డ్ కప్ మ్యాచుల్లో హర్షల్ పటేల్ వల్ల మ్యాచ్ గెలుపు ఓటములు మారిపోతాయనే భయం క్రికెట్ అభిమానుల్లో తలెత్తింది. మరి దీనిని హర్షల్ పటేల్, టీమిండియా ఎలా అధిగమనిస్తాయో చూడాలి.