Team India: T20 వరల్డ్ కప్ కు సన్నద్ధం అవ్వడానికి ఏ జట్టు ఆడనన్ని T20 సిరీస్ లను టీమ్ ఇండియా ఆడింది. ఫైనల్ జట్టును ఎంపిక చేయడానికి ప్రతి సిరీస్ లో ఎన్నో మార్పులను చేస్తూ వచ్చింది. ఇక చివరిగా ఒక తుది జట్టుతో టీ20 వరల్డ్ కప్ సమరానికి సిద్ధమయింది. టి20 సమరంలో టీమిండియా ఎవరిపై ఎక్కువగా ఆధారపడుతుందో మనం తెలుసుకోవాలి.
T20 సమరానికి ముందే బుమ్రా, జడేజా గాయాలతో టోర్నీకి దూరమయ్యారు. ఇది టీమిండియాకు అతిపెద్ద సమస్యగా మారింది. రిజర్వ్ బెంచ్ బలంగా ఉండడంతో వీరి గురించి పెద్దగా మనం మాట్లాడుకోవడం లేదు. బుమ్రా, జడేజా స్థానాల్లో షమీ, అక్షర్ పటేల్ జట్టులోకి వచ్చారు. గత టి20 వరల్డ్ కప్ లో మనం పాకిస్తాన్ పై ఓడిపోయాం. మళ్లీ ఈ నెల 23న పాకిస్తాన్ తో టి20 సమరాన్ని ఆరంభించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎలాగైనా గెలిచి మంచి ఆరంభాన్ని అందించాలని, పాకిస్తాన్ ను దెబ్బ కొట్టాలని అభిమానులు కోరుకుంటున్నారు.
ఈ సంవత్సరం ప్రారంభం నుంచి సూర్య కుమార్ యాదవ్ భీకరమైన ఫామ్ లో ఉన్నాడు. మిడిల్ ఆర్డర్లో 200 పైగా స్ట్రైక్ రేట్ ను కొనసాగించడం మామూలు విషయం కాదు. దీన్ని బట్టి మనకు సూర్య కుమార్ యాదవ్ టి20 వరల్డ్ కప్ లో ఎంత విలువైన ఆటగాడో తెలుస్తుంది. ఈ పెద్ద ఈవెంట్లో సూర్య కుమార్ యాదవ్ టీమిండియాకు కీలక ఆటగాడని మనకు తెలుస్తుంది.
ఇక సూర్య కుమార్ యాదవ్ తర్వాత దినేశ్ కార్తీక్ T20 ప్రపంచకప్ లో కీలక పాత్ర పోషించే అవకాశాలు ఉన్నాయి. ఐపీఎల్ తో బెస్ట్ ఫినిషర్ రోల్ ప్లే చేస్తున్న దినేష్ కార్తీక్ వికెట్ కీపర్ గా కూడా సేవలు అందించడం అతడికి ప్లస్ పాయింట్. దీంతో అతడు తుది జట్టులో ఆడటం ఖాయంగా అనిపిస్తుంది. మొదటి T20 వరల్డ్ కప్ 2007లో ఆడి, మళ్లీ ఇప్పుడు జట్టుకు ఎంపిక అవడం మామూలు విషయం కాదు. అతడి అనుభవం కూడా జట్టుకు ఉపయోగపడనుంది.
Team India:
జడేజా గాయపడటంతో అనూహ్యంగా T20 వరల్డ్ కప్ జట్టులోకి వచ్చిన అక్షర్ పటేల్.. ఆస్ట్రేలియాతో జరిగిన T20 సిరీస్ తో తనను తాను నిరూపించుకున్నాడు. ఏకంగా మ్యాన్ ఆఫ్ ద సీరీస్ నే సొంతం చేసుకున్నాడు. లెఫ్ట్ ఆర్మ్ తో బౌలింగ్ చేసే అక్షర్ పటేల్ బంతిని స్పిన్ చేస్తూ వేగంగా బంతులని విసరగలడు. ఇలాంటి ప్లస్ పాయింట్స్ ఉన్న ఆటగాళ్ళు మరోసారి పెద్ద ఈవెంట్ లో మంచి ప్రదర్శనను చేస్తే T20 వరల్డ్ కప్ టీమిండియా సొంతం అవుతుంది. మనం కూడా సగటు అభిమానులుగా టీమిండియా కప్ కొట్టాలని ఆశిద్దాం.