గత కొంతకాలంగా టీడిపి కార్యక్రమాలకు దూరంగా ఉంటూ వస్తున్న విజయవాడ ఎంపీ కేశినేని నాని త్వరలో బాంబ్ పేల్చనున్నారు.ప్రస్తుతం ఢిల్లీలో ఉన్న ఆయన బిజేపిలో చేరడం పై ఆ పార్టీ నేతలతో చర్చలు జరుపుతున్నారు.చాలారోజుల నుండి బిజేపిలో చేరాలనే ఆలోచనలో ఉన్న కేశినేని నాని తాజాగా ఆయన భవన్ లో ఉన్న చంద్రబాబు నాయడు ఇతర తెలుగుదేశం నాయకుల ఫోటోలని తొలగించారు.
ఒకవేళ కేశినేని నాని తాను బిజేపిలో చేరానని ప్రకటిస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతమున్న పరిస్థితుల్లో టీడిపి గెలవడం అసాధ్యం అందుకే ఆయన ఆ అవకాశం ఉన్న బిజేపిలో చేరారని బిజేపి కార్యకర్తలు ప్రచారం చేసి టీడిపి హోదాని గ్రౌండ్ లెవెల్ డ్యామేజ్ చేసే అవకాశం ఉంది.ఇక అధికార పార్టీ కార్యకర్తలు అయితే వాళ్లంతా ఒక్కటే అందుకే అటు వాళ్ళ ఇటు, ఇటువాళ్ళు అటు జంపింగ్ లు చేస్తున్నారు అని ఒక విమర్శతో ప్రతిపక్షాలన్నిటిని దెబ్బ తీసే అవకాశం ఉంది.