ఏపీ రాజకీయాలలో మరల ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది పార్టీల సమీకరణాలు, నాయకుల సమీకరణాలు మారిపోతున్నాయి. ముఖ్యంగా వచ్చే ఎన్నికలలో జనసేన, టీడీపీ పొత్తు పెట్టుకోవడానికి రెడీ అవుతున్న విషయం స్పష్టం అయిన నేపధ్యంలో వైసీపీ, బీజేపీ పార్టీలలో ఉండి సైలెంట్ గా ఉన్న నాయకులు ఆలోచనలు మార్చుకుంటున్నారు. ఇక వేళ పొత్తులు ఖాయం అయితే ఆ కూటమికి విజయావకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అంటే ఆ పార్టీలోకి ఎన్నికల ముందు జంప్ అయిపోయే నాయకులు కొంత మంది ఉంటారు. గత ఎన్నికల ముందు, అలాగే ఎన్నికల తర్వాత కొంత మంది టీడీపీ నాయకులు వైసీపీ గూటికి వెళ్ళారు. మరికొంత మంది వైసీపీ వేధింపులకి భయపడి బీజేపీ పార్టీ కండువా కప్పెసుకున్నారు.
ఇక బీజేపీ గూటికి చేరిన టీడీపీ నాయకులు అందరూ మరల సొంతగూటికి వచ్చేందుకు సిద్ధం అవుతున్నారనే మాట వినిపిస్తుంది. దీనికి కారణం ఇంతకాలం తమ వ్యాపారాలు కాపాడుకోవడానికి బీజేపీలో ఉన్నారు. ఇప్పుడు వచ్చే ఎన్నికలలో టీడీపీ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి మరల సొంతగూటికి వచ్చి ఎదో ఒక పదవి సొంతం చేసుకోవాలని ఆశపడుతున్నారు. అలా క్యూ కట్టే వారిలో జమ్మలమడుగులో 2014 ఎన్నికలలో వైసీపీ తరుపున గెలిచినా ఆదినారాయణరెడ్డి తరువాత టీడీపీలో చేరారు. ఇక 2019 వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన టీడీపీని వీడి బీజేపీలో చేరారు. దానికి కారణం జగన్ రెడ్డి వేధింపులకి భయపడే అనే విషయం చాలా మందికి తెలుసు.
అలాగే సొంత వ్యాపారాలని కాపాడుకోవడానికి కూడా ఆదినారాయణరెడ్డిబీజేపీ గూటికి వెళ్ళారు. అయితే ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో బీజేపీ నుంచి పోటీ చేస్తే గెలిచే అవకాశం లేకపోవడంతో మరల టీడీపీ గూటికి రావడానికి ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. చంద్రబాబు గ్రీన్ సిగ్నల్ కోసం అతను వేచి చూస్తున్నట్లు బోగట్టా. మరో వైపు ఎంపీ టీజీ వెంకటేష్. అలాగే సుజనా చౌదరి లాంటి వారు కూడా టీడీపీ గూటికి రావడానికి సిద్ధం అవుతున్నారు. అయితే ముందు బీజేపీని టీడీపీతో కూటమి కట్టే దిశగా పావులు కదపడం, కుదరకుంటే జంప్ కావడం వారి ముందున్న ఆలోచనగా తెలుస్తుంది.