బిగ్ బాస్ సీజన్-5 ఫేవరెట్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన షణ్ముఖ్ జస్వంత్ సీజన్ ఫినాలే వచ్చేసరికి రన్నరప్‌గా నిలిచారు.అలాంటి షణ్ముఖ్ జస్వంత్ మరియు అతని గర్ల్‌ఫ్రెండ్,దీప్తి సునయన న్యూ ఇయర్ రోజు నెటిజన్స్ కు ‘బ్రేకప్’ న్యూస్ తో షాక్ ఇచ్చారు.ప్రస్తుతం ఈ వ్యవహారంపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతుంది.ఈ వ్యవహారంపై స్పందించిన షణ్ముఖ్ వాళ్ళ అమ్మ దీప్తి ఇలా చేయడం సరి కాదని దీప్తి పై మండిపడ్డారు.ఇక ఈ ‘బ్రేకప్’ కు కారణం ఏంటి ఎవరో అనే అంశాలపై సోషల్ మీడియాలో పలు రకాల కథనాలు ప్రచరవుతున్నాయి.ఇందులో నిజమెంత ఉందో తెలియదు.
ఇక బిగ్ బాస్ సీజన్ 2 లో పాల్గొన్న దీప్తి అప్పట్లో హౌస్ లో టాలీవుడ్ హీరో తనీష్ తో చాలా క్లోజ్ ఉంది.అలాగే షణ్ముఖ్ ఈ సీజన్ లో సిరి తో క్లోజ్ గా ఉన్నాడు దానికి నువ్వు ‘బ్రేకప్’ చెప్పడం ఏంటి అంటూ కొందరు నెటిజన్స్ దీప్తిపై విరుచుకుపడుతుంటే మరికొందరు దీప్తికి మద్దతుగా నిలుస్తూ షణ్ముఖ్ ను ట్రోల్ చేస్తున్నారు.ఈ తతంగం చూసిన తనీష్ వాళ్ళిద్దరి ‘బ్రేకప్’ వ్యవహారంలోకి నన్ను ఎందుకు లాగుతున్నారని ప్రశ్నించాడు.ప్రస్తుతం సోషల్ మీడియాను కుదిపేస్తున్న ఈ సోషల్ మీడియా ఇన్ ఫ్లూఎన్సర్స్ బ్రేక్ అప్ వ్యవహారం తరువాత ఎటువైపు వెళ్తుందో వేచి చూడాలి.