Tamil Actress Deepa Sucide: ప్రస్తుత రోజుల్లో సెలబ్రిటీలు విడాకులు తీసుకోవడం ఆత్మహత్య చేసుకోవటం సర్వసాధారణం అయిపోయింది. ఈ దిశగానే తాజాగా తమిళ సినిమా ప్రముఖ హీరోయిన్ దీప అలియస్ పౌలిన్ జెస్సికా ఆత్మహత్య చేసుకుంది. చెన్నైలోని విరుగంబాక్కంలో ఉంటున్న ఆమె నివాసంలో తన గదిలో ఉరేసుకుని చనిపోయింది. దీప మరణానికి కారణం ప్రేమ అని సన్నిహితులు మరియు బంధుమిత్రులు అనుకుంటున్నారు. దీప తల్లిదండ్రులు చాలా సార్లు ఫోన్ చేసినా గాని దీప ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో.. అనుమానం వచ్చి ఆమె స్నేహితుడిని ఇంటికి పంపించారు.
దీంతో అప్పటికే దీప మరణించడం జరిగింది. అయితే ఆమె ఉరేసుకున్న గదిలో సూసైడ్ నోట్ లభించింది. ఆ లెటర్ లో.. “నా ఆత్మహత్యకు ఎవరు కారణం కాదని తెలియజేసింది”. అదే సమయంలో జీవితాంతం ఒకరిని ప్రేమిస్తూనే ఉంటానని చెప్పుకొచ్చింది. దీంతో దీప మృతికి ప్రేమ వ్యవహారమే అని అందరూ భావిస్తున్నారు. కానీ ఆమె ఏ వ్యక్తిని ప్రేమించిందో ఆ లెటర్ లో పేరు ఏమి తెలియజేయలేదు. దీంతో దీప మరణానికి ప్రేమ వ్యవహారమే అని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం దీప మృతదేహాన్ని పోస్ట్ మార్టంకి తరలించడం జరిగింది. తమిళ ఇండస్ట్రీలో అనేక సినిమాలు దీప చేయటం జరిగింది.
ఇటీవలే ‘వైధా’ సినిమాలో హీరోయిన్ గా నటించడం జరిగింది. చాలా చిన్న వయసులోనే దీప మరణించడంతోపాటు ఆమె సూసైడ్ నోట్ రాయటం తమిళ ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. దీప మరణంతో చాలామంది తమిళ ఇండస్ట్రీకి చెందిన వాళ్లు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఇదే సమయంలో ఆమె కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నారు. ఇండస్ట్రీలో మంచి భవిష్యత్తు ఉన్న సమయంలో దీప ఈ రీతిగా ఆత్మహత్య చేసుకోవటం బాధాకరమని అంటున్నారు.