Tamannah Bhatia : పాలమీగడ లాంటి అందం తమన్నా సొంతం. తన నటనతో, డ్యాన్స్ మూవ్స్‌తో పాటు గ్లామర్ షో తో టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్ స్థానాన్ని కైవసం చేసుకుంది. శేఖర్ కమ్ముల చిత్రం హ్యాపీడేస్ చిత్రంలో తెరంగేట్రం చేసిన తమన్నా వరుస ఆఫర్లతో ఇండస్ట్రీలో తనదైన మార్క్‌ను క్రియేట్ చేసుకుంది. ఈ బ్యూటీ రీసెంట్‌గా ఎఫ్3 మూవీ తరువాత టాలీవుడ్‌కు కాస్త బ్రేక్ ఇచ్చి ఇప్పుడు బాలీవుడ్‌లో మకాం వేసింది. హిందీలో రీసెంట్‌గా బౌన్సర్ బబ్లీగా అలరించింది తమ్ము. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు ఫ్యాషన్ అవుట్‌ఫట్స్ వేసుకుని హాట్ ఫోటో షూట్‌లు చేస్తూ సోషల్ మీడియాలోనూ ఆక్టివ్ గా ఉంటోంది.

తాజాగా మితగా తారలతో పాటే అవార్డుల ఈవెంట్ కోసం దుబాయ్ వెళ్లిన తమన్నా అదిరిపోయే లుక్‌లో కనిపించి అందరిని ఆకట్టుకుంది. ఎరుపు రంగు గౌన్‌లో ఏంజెల్ లా కనిపించి కుర్రాళ్లకు కునుకు లేకుండా చేసింది ఈ మిల్క్ బ్యూటీ.

Tamannah Bhatia : ఫ్యాషన్ డిజైనర్ టోనీ వార్డ్ రూపొందించిన అత్యద్భుతమైన రెడ్ కలర్ గౌన్ వేసుకుని తళుక్కుమంది తమన్నా. తన బాడీ కలర్‌కు కాంట్రాస్ట్‌గా ఉన్న ఈ అవుట్‌ఫిట్‌లో ఎంతో హాట్‌గా కనిపించింది. చిన్న చిన్న అలంకరణలు, బీడ్ వర్క్‌తో వ్రాప్ లాంటి నెక్‌లైన్ తో వచ్చిన కార్సెట్ టాప్ , ఆకర్షణీయంగా యువరాణి లుక్‌లో భారీ ఫ్రిల్స్‌తో వచ్చిన బాటమ్‌లో ఈ బ్యూటీ ధగధగ మెరిసిపోయింది.

ఈ అవుట్‌ఫిట్ కు తగ్గట్లుగా తమన్నా చెవులకు లాంగ్ ఇయర్ రింగ్స్‌ను అలంకరించుకుంది. చేతి వేళ్లకు స్టేట్మెంట్ ఉంగరాలను పెట్టుకుంది. తన కురులతో స్లీక్ పోనీటెయిల్ వేసుకుని స్లైటిష్ లుక్‌లో అదరగొట్టింది. కనులకు షిమ్మరింగ్ ఐ లిడ్స్, వింగెడ్ ఐ లైనర్, మస్కరా వేసుకుంది. బుగ్గలను హైలెట్ చేసుకుని పెదాలకు మట్టీ లిప్ కలర్ వేసుకుని గ్లామరస్ లుక్స్‌తో ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవర్స్‌ను తన ఫ్యాషన్ లుక్స్‌తో జామ్ చేసింది.

రీసెంట్‌గా మరో రెడ్ కలర్ అవుట్‌ఫిట్ వేసుకుని కుర్రాళ్లను రెచ్చగొట్టింది తమన్నా. క్లాతింగ్ బ్రాండ్ ఇన్‌ట్రిన్సిక్ నుంచి ఎన్నుకున్న రెడ్ కలర్ కార్సెట్ టాప్‌ను వేసుకుంది తమ్ము. దానికి మ్యాచింగ్‌గా డిజైనర్స్ శివన్ నరేష్ ల క్లాతింగ్ లేబుల్ నుంచి వైడ్ లెగ్ రెడ్ పాకెట్స్ కార్గో ప్యాంట్‌ను వేసుకుంది. ఈ మోనోక్రొమాటిక్ బాడీకాన్ అవుట్‌ఫిట్‌లో తన ఫిగర్ ను పర్ఫెక్ట్‌గా చూపిస్తూ పిచ్చెక్కించింది తమన్నా భాటియా. ఈ అవుట్‌ఫిట్ కు మ్యాచ్ అయ్యేలా భుజానికి పింక్ కలర్ బ్యాగ్ వేసుకుంది. పాదాలకు పాయింటెడ్ రెడ్ హీల్స్‌ను ధరించింది. పెదాలకు రెడ్ కలర్ లిప్‌స్టిక్ పెట్టుకుని రెడ్ మానియాతో కుర్రాళ్ల హృదయాలను కొల్లగొట్టింది.
