Tamannah Bhatia : యూనిక్ ఫ్యాషన్ స్టైల్స్ తో ఫ్యాషన్ ప్రియులను ఎలా ఆకట్టుకోవాలో మిల్కీ బ్యూటీ తమన్న భాటియాకు బాగా తెలుసు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే తమన్నా తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ ని ఎరుపెక్కించింది. రెడ్ కలర్ అవుట్ ఫిట్ వేసుకుని స్టైలిష్ లుక్స్ తో నెట్టింట్లో హల్ చల్ చేసింది. తన లుక్ కి సంబంధించిన పిక్స్ ను వరుస పెట్టి పోస్ట్ చేసి ఫాలోవర్స్ కు పిచ్చెక్కించింది.

Tamannah Bhatia : తమన్నా తాజాగా చేసిన ఓ ఫోటోషూట్ కోసం కార్సెట్ టాప్ మ్యాచింగ్ ట్రౌజర్స్ ని వేసుకుంది. టాప్ టు బాటమ్ రెడ్ కలర్ వేసుకుని రెడ్ మిర్చి లాగా రెచ్చిపోయింది ఈ హాట్ భామ. స్ట్రాపీ టాప్, మల్టీ పాకెట్ ట్రౌజర్స్ లుక్ తో ఫ్యాషన్ ప్రియులకు స్టైలిష్ ఫ్యాషన్ స్టేట్మెంట్స్ ఇస్తోంది.

ఈ అట్రాక్టివ్ అవుట్ ఫిట్ ను ప్రముఖ క్లాతింగ్ లేబుల్ ఇన్ ట్రింసిక్ , శివన్ అండ్ నరేష్ డిజైన్స్ నుంచి సేకరించింది. ఈ అందమైన అవుట్ ఫిట్ లో తన ఎద అందాలను చూపిస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది తమ్ము. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్ లో వైరల్ అవుతున్నాయి. అమ్మడి అవుట్ ఫిట్ పైన క్రేజీ కామెంట్స్ వస్తున్నాయి.

రెడ్ కలర్ డ్రెస్ కు జోడీగా చేతిలో పింక్ కలర్ హ్యాండ్ బ్యాగ్ పట్టుకొని మెరిసిపోయింది. స్టైలిస్ట్ షలీనా నతాని , వసుధా గుప్తా తమన్నాకు స్టైలిష్ లుక్స్ అందించారు. తన సిల్కీ హెయిర్ తో పోనిటైల్ వేసుకుని, పెదాలకు రెడ్ లిప్ స్టిక్ పెట్టుకొని గ్లామరస్ లుక్ తో కైపెక్కిస్తోంది.

రీసెంట్ గా తరుణ్ తహిలియాని ఫ్యాషన్ లేబుల్ నుంచి అదిరిపోయే చీరను కట్టుకుని అందరిని మంత్రముగ్ధులను చేసింది తమ్ము . బూడిద రంగులో ఉన్న చిరకు జోడిగా బుగ్గల జాకెట్టు వేసుకుని అదరగొట్టింది ఈ మిల్కీ బ్యూటీ .

స్టైలిస్ట్ యామి , అనుష్క తమన్నా కు స్టైలిష్ లుక్స్ అందించగా మాణిక్ అదిరిపోయే మేకోవర్ ఇచ్చాడు . సీమ స్టన్నింగ్ హెయిర్ స్టైల్ ను అందించింది.
