Tamannah Bhatia : మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా ప్రస్తుతం తన రాబోయే తెలుగు చిత్రం గుర్తుందా సీతకాలం విడుదల కోసం వేచి ఉంది. ఈ మూవీ డిసెంబర్ 9న విడుదల కానుంది. ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగి నిజమైన ప్రేమను కనుగొనాలనే తపనతో చేసే ప్రయాణానికి సంబంధించిన మూవీ ఇది. ఈ మూవీ లో సత్యదేవ్ సరసన కథానాయికగా తమన్నా నటిస్తోంది.

ప్రస్తుతం ఈ సినిమా ప్రమోషన్స్‌లో బిజీగా గడుపుతోంది తమ్ము . ఫ్యాషన్ ఫోటో షూట్ లతో ఫ్యాన్స్ ను అట్రాక్ట్ చేస్తోంది. లేటెస్ట్ గా తమన్నా తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన ప్రమోషన్ డైరీల నుండి కొన్ని స్నిప్పెట్‌లను పంచుకుంది. ఈ పిక్స్ ప్రస్తుతం నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

తమన్నా తన ప్రమోషన్ ఫోటో షూట్ కోసం ఫ్యాషన్ డిజైనర్ హౌస్ మూన్‌రేకు మ్యూజ్ గా వ్యవహరించింది . ఈ డిజైనర్ హౌస్ షెల్ఫ్ నుండి అదిరిపోయే అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది ఈ అమ్మడు. క్లోజ్డ్ నెక్‌లైన్, ఫుల్ స్లీవ్‌లతో అలంకరించబడిన తెల్లటి నెటెడ్ టాప్, ల్యాపెల్ కాలర్‌లు, నడుము వద్ద నీలిరంగు బెల్ట్ , నడుము క్రింద ప్లీట్ మరియు టైర్ వివరాలను కలిగి ఉన్న ప్రకాశవంతమైన నీలం రంగు స్లీవ్‌లెస్ షార్ట్ అవుట్ ఫిట్ వేసుకుని అందరిని మంత్ర ముగ్ధులను చేసింది.

ఈ అవుట్ ఫిట్ కు తగ్గట్లుగా బ్లింగ్ సూత్ర షెల్ఫ్‌ల నుండి సేకరించిన పాస్టెల్ బ్లూ ఫుట్ వేర్ ను పాదాలకు వేసుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ షాలిని నతాని తమన్నాకు స్టైలిష్ లుక్స్ ని అందించింది. తన కురులను లూస్ గా వదులుకున్నారు. బిల్లీ మాణిక్ అందించినమేకప్ లుక్స్ లో గ్లామరస్ గా కనిపించి కుర్రాళ్లకు చెమటలు పాటించింది.

కనులను న్యూడ్ ఐ ష్యాడో , మస్కారా, వింగేడ్ లైనర్ ,పేదలకు న్యూడ్ లిప్ స్టిక్ దిద్దుకుని మెరిసింది. స్విమ్మింగ్ పూల్ బ్యాక్ డ్రాప్ లో దిగిన ఈ పిక్స్ లో అప్సరసలా మెరిసింది మిల్కీ బ్యూటీ.
