Tamannah Bhatia : తమన్నా భాటియా ఒక సంపూర్ణమైన ఫ్యాషన్‌వాది. ఈ మిల్కీ బ్యూటీ తన ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌లో తన అప్‌డేటెడ్ ఫ్యాషన్ డైరీల నుండి స్నిప్పెట్‌లను తరచుగా పోస్ట్ చేస్తూ ఫ్యాషన్ వైబ్‌లను వ్యాప్తి చేస్తూనే ఉంటుంది. సాధారణ అవుట్‌ఫిట్స్ నుంచి పండుగ దుస్తుల వరకు, ఫార్మల్ ప్యాంట్‌సూట్‌లోనూ ఎలా ఫ్యాన్స్‌ను ఫిదా చేయాలో ఈ భామకు బాగా తెలుసు. తమన్నా ప్రతి సందర్భానికి తగ్గట్లుగా అన్ని రకాల ఫ్యాషన్ లక్ష్యాలను అందిస్తూనే ఉంటుంది.

నటి ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్ మొత్తం ఆమె ఫ్యాషన్ ఫోటోషూట్‌ల చిత్రాలు ,వీడియోలతో నిండి ఉంటుంది. వాటిలో ప్రతి ఒక్కటి ఫ్యాషన్ స్టేట్‌మెంట్‌లను అందిస్తూనే ఉంటుంది. ప్రతి చిత్రంతోనూ, తమన్నా ఫ్యాషన్ ప్రేమికులు నోట్స్ తీసుకోవడానికి తహతహలాడేలా చేస్తుంది. తాజాగా ఈ బ్యూటీ యూనిక్ అవుట్‌ఫిట్ వేసుకుని అందరినీ అవాక్కు చేసింది.

తమన్నా భాటియా ఫుల్ లెన్త్ ఫ్యాషన్ మూడ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది ఆమె లేటెస్ట్ అవతారం చూస్తే. ఫ్యాషన్ డిజైనర్ హౌస్ ముగ్లర్‌కు మ్యూజ్ గా వ్యవహరించిన తమ్ము తన ఫోటో షూట్ కోసం డెనిమ్ అవుట్‌ఫిట్‌ను ఎంచుకుంది. ఈ డెనిమ్ జీన్స్ వేషధారణలో, తమన్నా బైకర్ బాస్ బేబ్ గోల్స్ అందించింది. తమన్నా నలుపు రంగు బటన్లు ఉన్న కాలర్స్, ఫుల్ స్లీవ్స్ దగ్గర డెనిమ్ డీటైల్స్ తో వచ్చిన బ్లాక్ శాటిన్ స్టైలిష్ షర్ట్ ను ధరించింది.

దీనికి జోడీగా ఆమె కాళ్ల పొడవునా నీలిరంగు డెనిమ్ ప్యాచ్‌లను కలిగి ఉన్న నల్లటి ప్యాంటు ను వేసుకుంది. ఈ అవుట్‌ఫిట్‌తో దిగిన పిక్స్ ను తమన్నా తన ఇన్‌స్టాలో పోస్ట్ చేసింది. ప్రస్తుతం ఈ పిక్స్ నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి.

ఈ అవుట్‌ఫిట్‌కు తగ్గట్లుగా తమన్నా వెర్సాస్ షెల్ఫ్‌ల నుండి సేకరించిన బ్లాక్ వెల్వెట్ హీల్స్‌ను తన పాదాలకు వేసుకుంది. ఫ్యాషన్ స్టైలిస్ట్ అమీ పటేల్ తమన్నాకు స్టైలిష్ లుక్స్‌ను అందించింది. ఈ బ్యూటీ తన ఉంగరాల కురులను సైడ్ పాపిట తీసి లూస్ గా వదులుకుంది.

మేకప్ ఆర్టిస్ట్ ఫ్లోరియన్ హురెల్ సహాయంతో తమన్నా తన అందానికి మెరుగులు దిద్దుకుంది. కనులకు న్యూడ్ ఐషాడో, బ్లాక్ ఐలైనర్, కనురెప్పలకు బ్లాక్ మస్కరా వేసుకుని , కనుబొమ్మలను డార్క్ చేసుకుంది. తన పెదాలకు మెరూన్ లిప్‌స్టిక్ దిద్దుకుని తమన్నా తన గ్లామరస్ లుక్స్ తో అభిమానుల మనసును కొల్లగొట్టింది.
