సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 20 ఏళ్ళకి దగ్గర అయిపోతుంది. ఇప్పటికి ఆమె తన ఇమేజ్ ని ఏ మాత్రం కోల్పోకుండా స్టార్ హీరోయిన్ గానే సినిమాలు చేసుకుంటూ వెళ్తుంది. ప్రస్తుతం తెలుగులో సత్యదేవ్ తో కలిసి నటించిన గుర్తుందా శీతాకాలం సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. దీంతో పాటు మెగాస్టార్ కి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటించింది. ఇక ఓ హిందీ ప్రాజెక్ట్ లో కూడా తమన్నా నటిస్తుంది. ఇలా చేతిలో మూడు, నాలుగు ప్రాజెక్ట్స్ వరకు ఉన్నాయి. ఇదిలా ఉంటే చాలా కాలంగా తమన్నా పెళ్లి గురించి సోషల్ మీడియాలో చర్చ నడుస్తుంది. త్వరలో పెళ్లి పీటలు ఎక్కబోతుంది అనే ప్రచారం నడిచింది.
అయితే దీనికి తమన్నా ఎప్పటికప్పుడు ఫుల్ స్టాప్ పెట్టుకుంటూ వస్తుంది. అయితే తాజాగా మరోసారి తమన్నా పెళ్లి గురించి ఓ ఆసక్తికరమైన కథనం సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది. తమన్నా పేరెంట్స్ రీసెంట్ గా ఆమెకి మంచి సంబంధం చూసారని టాక్. ఇక ముంబైలో ప్రముఖవ్యాపారవేత్తని తమన్నా పెళ్లాడబోతుందని సమాచారం. ఇప్పటికే రెండు కుటుంబాల మధ్య ఈ పెళ్లి గురించిన మాటలు కూడా అయిపోయాయనని తెలుస్తుంది. అయితే తమన్నా చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలు కంప్లీట్ అయిన తర్వాత ఆమె పెళ్లి పీటలుఎక్కడానికి నిశ్చయించుకుందని తెలుస్తుంది.
ఇదే విషయాన్నిపేరెంట్స్ కి కూడా చెప్పేసినట్లు బోగట్టా. అయితే మొదటి నుంచి తమన్నా చెబుతున్నట్లు తన పేరెంట్స్ చూసిన అబ్బాయిని పెళ్లి చేసుకోవడానికి రెడీ అవుతూ ఉండటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. అయితే ఈ పెళ్లి వార్త కేవలం గాసిప్ అని తమన్నా అభిమానులు కొట్టిపారేస్తున్నారు. ఇప్పట్లో ఆమె పెళ్లి చేసుకోదని, దీనిపై గతంలోనే క్లారిటీ ఇచ్చిందని అంటున్నారు. అయితే సెలబ్రెటీల జీవితాలలో ఎప్పుడు ఏం జరుగుతుంది అనేది ఎవరో చెప్పలేరు. మరి ఈ పెళ్లికి సంబందించిన వార్తలలో వాస్తవం ఎంత అనేది తెలియాలంటే తమన్నా అఫీషియల్ గా స్పందించే వరకు వేచి చూడాల్సిందే.