Tamannaah: ప్రస్తుతం తెలుగు సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్లలో రాణిస్తున్న వారిలో తమన్నా కూడా ఒకరు. తమన్నా పేరు వినగానే మనకు ముందుగా గుర్తుకు వచ్చేది ఆమె అందం. తమన్నా అందానికి యూత్ లో ఏ రేంజ్ లో ఫ్యాన్స్ ఫాలోయింగ్ ముందు అందరికీ తెలిసిందే. మొదట శ్రీ సినిమాతో తెలుగు ఇండస్ట్రీకి పరిచయం అయింది తమన్నా.
తెలుగుతోపాటు పాన్ ఇండియా భాషల్లో నటించి అన్ని భాషల్లో కూడా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది. అలా దాదాపుగా 50 కి పైగా సినిమాలలో నటించి మెప్పించింది. టాలీవుడ్ టాప్ హీరోలు అయినా చిరంజీవి, బాలకృష్ణ, ప్రభాస్, రామ్ చరణ్ ఇలా స్టార్ హీరోలు అందరి సరసన నటించి స్టార్ హీరోయిన్గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును ఏర్పరచుకుంది తమన్నా.
ఇకపోతే తమన్న సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 15 ఏళ్లు పూర్తి అవుతోంది. అయినా కూడా 15 ఏళ్ల నుంచి అదే ఊపుతో సినిమాలలో అవకాశాలు అందుపుచ్చుకొని వరుస సినిమా అవకాశాలతో దూసుకుపోతోంది. సినిమా హిట్టు ఫ్లాప్ తో సంబంధం లేకుండా సినిమాలు వెబ్ సిరీస్ లో నటిస్తోంది.
ఇక బాహుబలి లాంటి సినిమాలు లో నటించి పాన్ ఇండియా లెవెల్ లో హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న విషయం తెలిసిందే. ఇది ఇలా ఉంటే ఈ మిల్క్ బ్యూటీ కి సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో అభిమానులు ఉన్నారో మనందరికీ తెలిసిందే. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ చేతిలో పలు ప్రాజెక్టులు ఉన్న విషయం తెలిసిందే.
సినిమాలు పట్టాలెక్కకు ముందే మరికొన్ని ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్ ఇస్తూ దూసుకుపోతోంది. సినిమాల వరంగా ఫుల్ బిజీగా ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో మాత్రం ఫుల్ యాక్టివ్ గా ఉంటుంది తమన్నా. ఎప్పటికప్పుడు తనకు సంబంధించిన ఫోటోలను వీడియోలను అభిమానులతో పంచుకుంటూ అభిమానులకు మరింత చేరువ అవుతూ ఉంటుంది. వయసు పెరుగుతున్నా కూడా అదే అందాన్ని మెయింటైన్ చేస్తూ యువత గుండెల్లో గుబులు రేపుతూ ఉంటుంది.
అయితే ఈమె వయసు మీద పడుతున్న కూడా అందం ఏ మాత్రం చెక్కుచెదరడం లేదు. ఇది ఇలా ఉంటే చాలు తాజాగా తమన్నా తన ఇంస్టాగ్రామ్ ఖాతాలో కొన్ని ఫోటోలను షేర్ చేసింది. ఆ ఫోటోలలో ఆమె కూర్చుని స్టైలిష్ గా కనిపించి ఫోటోలకు ఫోజులు ఇచ్చింది. ఇందుకు సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. ఆ ఫోటోలను చూసిన అభిమానులు ఆ ఫోటోలపై కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.