నేచురల్ స్టార్ నాని హీరోగా పాన్ ఇండియా రేంజ్ లో తెరకెక్కుతున్న సినిమా దసరా. ఈ సినిమాలో నాని ఫుల్ మాస్ అవతార్ లో దర్శనం ఇస్తున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి సురేష్ ఈ మూవీలో హీరోయిన్ గా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో తెరకెక్కుతున్న ఈ సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉంది. విలేజ్ బ్యాక్ డ్రాప్ లో ఈ మూవీ కథాంశం ఉండబోతుందని టాక్. అది కూడా పీరియాడిక్ జోనర్ లో నడిచే కథగా దర్శకుడు దీనిని ఆవిష్కరిస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో ప్రత్యేక గీతం కోసం స్టార్ హీరోయిన్ రంగం లోకి దిగుతుంది.
సౌత్ ఇండియా స్టార్ బ్యూటీ తమన్నా ఇప్పటికే ఓ వైపు హీరోయిన్ గా చేస్తూ మరో వైపు ఐటెం సాంగ్స్ కూడా చేస్తుంది. ఈ నేపధ్యంలో నేచురల్ స్టార్ సినిమాలో ఐటెం సాంగ్ కోసం తమన్నాని కన్ఫర్మ్ చేసినట్లు టాక్ వస్తుంది. ఈ సాంగ్ కోసం ఆమెకి భారీగానే ముట్టజెప్పినట్లు సమాచారం. పక్కా మాస్ ఫార్మాట్ లో ఈ సాంగ్ ఉంటుందని తెలుస్తుంది. ఇక తమన్నా కూడా కాస్తా కొత్తగా ఉంటుందని ఈ సాంగ్ చేయడానికి ఒకే చెప్పిందని తెలుస్తుంది.
ఇదిలా ఉంటే మరో టాక్ కూడా ఈ సినిమాలో ఐటెం సాంగ్ కోసం వినిపిస్తుంది. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశీ రౌతేలాని చిత్ర నిర్మాత సంప్రదించినట్లు సమాచారం. అయితే తమన్నా, లేదంటే ఊర్వశీలో ఒకరిని ఈ మూవీ కోసం ఖరారు చేసే అవకాశం ఉందనే మాట ఫిలిం నగర్ సర్కిల్ లో వినిపిస్తుంది. నేచురల్ స్టార్ నాని ఈ మూవీతో తనకి పాన్ ఇండియా హీరో ఇమేజ్ వస్తుందని గట్టి నమ్మకంతో ఉన్నాడు. అందుకు తగ్గట్లుగానే సినిమా కోసం తన రూపాన్ని పూర్తిగా మార్చుకొని కష్టపడుతున్నాడు.