సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నాకి తెలుగులో ఎక్కువ సక్సెస్ రేట్ ఉంది. అయితే హిందీలో మాత్రం పెద్దగా సక్సెస్ రేట్ లేదని చెప్పాలి. ఆమె నటించిన సినిమాలు భారీ స్థాయిలో రిలీజ్ అయినా కూడా డిజాస్టర్ గానే మారాయి. తాజాగా బబ్లీ బౌన్సర్ తో మరోసారి అదే ఫలితం తమన్నాకి రిపీట్ అయ్యింది. తెలుగులో రీసెంట్ గా ఎఫ్3తో సూపర్ హిట్ ని ఖాతాలో వేసుకున్న తమన్నా ప్రస్తుతం మెగాస్టార్ కి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఇక హిందీలో మధుర్ బండార్కర్ దర్శకత్వంలో బబ్లీ బౌన్సర్ సినిమాతో తాజాగా ఈ భామ ఓటీటీ ద్వారా ప్రేక్షకుల ముందుకి వచ్చింది.
హిందీలో మొదటిసారి తమన్నా ఫీమేల్ సెంట్రిక్ కథతో ప్రేక్షకులని ఎంటర్టైన్ చేసే ప్రయత్నం చేసింది. సోలోగా సక్సెస్ కొట్టి బాలీవుడ్ లో ఖాతా తెరవడంతో పాటు ఇకపై అక్కడ దూసుకుపోవాలని అనుకుంది. ఇక అందుకు తగ్గట్లుగానే సినిమా ప్రమోషన్ కూడా చేసింది. అయితే ఓటీటీలో రిలీజ్ అయిన ఈ సినిమా ఏ యాంగిల్ లో కూడా ఆడియన్స్ ని మెప్పించలేకపోయింది. మధుర్ బండార్కర్ దర్శకత్వం అనేసరికి నార్త్ ఆడియన్స్ భారీగా ఎక్స్ పెక్టేషన్స్ పెట్టుకొని చూసారు.
అయితే అతని స్టైల్ ఆఫ్ మేకింగ్ సినిమాలో ఎక్కడా కనిపించలేదు. ఒక నేషనల్ అవార్డు విన్నింగ్ దర్శకుడి నుంచి వచ్చిన చిత్రం అంటే నమ్మలేని స్థితిలో ఉందనే టాక్ వస్తుంది. ఓవరాల్ లో సినిమాని తమన్నా తన భుజాలపై వేసుకొని నడిపించింది. ఆమె పాత్ర చిత్రణ కూడా కొట్టగానే ఉంది. తనదైన శైలిలో హుసారైన యాక్టింగ్ తో పల్లెటూరి అమ్మాయిగా బాగానే నవ్వించే ప్రయత్నం చేసింది. అయితే ఆమె ఎంత కష్టపడిన కంటెంట్ లో దమ్ములేకపోతే ప్రేక్షకులకి రీచ్ కాదని బబ్లీ బౌన్సర్ సినిమా ప్రూవ్ చేసింది. చాలా గ్యాప్ తర్వాత పూర్తి స్థాయి హిందీ ప్రాజెక్ట్ తో అక్కడి ప్రేక్షకులని పలకరించిన తమన్నాని ఇంకా వారు సౌత్ హీరోయిన్ గానే చూస్తున్నారని ఈ మూవీ రిజల్ట్ బట్టి అర్ధమవుతుంది.