సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ తమన్నా ప్రస్తుతం సీనియర్ హీరోల సరసన జోడీగా నటిస్తూ వరుస అవకాశాలు సొంతం చేసుకుంటుంది. అలాగే సోలో హీరోయిన్ గా కూడా బాబ్లీ బౌన్సర్ సినిమాతో ఈ నెల ఆఖరున ప్రేక్షకుల ముందుకి రాబోతుంది. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈ సినిమాపై తమన్నా గట్టి హోప్స్ పెట్టుకుంది. దానికి తగ్గట్లుగానే సినిమా ప్రమోషన్స్ కూడా చేస్తుంది. ఇక ఈ మూవీతో హిందీలో హిట్ కొట్టి సోలో హీరోయిన్ గా మరిన్ని అవకాశాలు సొంతం చేసుకోవాలని తమన్నా భావిస్తుంది. అలాగే ఒటీటీలో కూడా కంటెంట్ బేస్ కథలని సెలక్ట్ చేసుకొని సత్తా చాటే ప్రయత్నం చేస్తుంది.
మరో వైపు తెలుగులో మెగాస్టార్ కి జోడీగా భోళా శంకర్ సినిమాలో నటిస్తుంది. ఇదిలా ఉంటే ఈ బ్యూటీ తన కొత్త సినిమా ప్రమోషన్ లో భాగంగా పెళ్లి గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ప్రస్తుతం ఈ బ్యూటీకి 32 ఏళ్ళు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ నేపధ్యంలో పెళ్లి కబురు ఎప్పుడు చేబుతారంటూ మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకి ఆమె ఆసక్తికరంగా సమాధానం చెప్పింది. ఇప్పటి వరకు పెళ్లి గురించి తనపై ఎవరూ ఒత్తిడి చేయలేదని, ఒక వేళ పెళ్లి ఘడియలు వస్తే మాత్రం ఎప్పుడైనా చేసుకోవడానికి సిద్ధంగానే ఉన్నానని చెప్పింది.
ఈ మాట ద్వారా తమన్నా తల్లిదండ్రులకి పెళ్లి కొడుకుని చూడమని గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు అయ్యిందనే మాట వినిపిస్తుంది. ఇప్పటికే కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకొని బిడ్డ తల్లి కూడా అయ్యింది. అయినా కూడా నటిగా కెరియర్ ని కొనసాగిస్తుంది. అలాగే తమన్నా కూడా పెళ్లి తర్వాత కూడా నటిగా కెరియర్ కొనసాగిస్తుందా అనేది చూడాలి. అయితే ఆమెని చేసుకోబోయే వాడు ఎలా ఉండాలనే విషయంలో తమన్నాకి కండిషన్స్ ఉన్నాయి. వాటన్నింటికి ఒప్పుకున్నా వ్యక్తినే పెళ్లి చేసుకుంటా అని గతంలో చెప్పిన సంగతి తెలిసిందే. మరి అలాంటి కండిషన్స్ ఒప్పుకునే భర్త ఎవరై ఉంటారా అనేది ఆసక్తికరంగా మారింది.