Tamannaah Bhatia : అవుట్ ఫిట్ ఏదైనా తన ఫిగర్ కు పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది అని అనిపించేలా ఉంటుంది తమన్నా భాటియా. ఈ మిల్క్ బ్యూటీ ఫాలో అయ్యే ఫ్యాషన్స్ అందరిని మైమరపింపచేస్తాయి. అకేషన్ ను బట్టి ప్లేస్ ను బట్టి దుస్తులను ధరించి అందరి చూపులు తన వైపు తిప్పుకుంటుంది తమన్నా. సౌత్ లో స్టార్ హీరోయిన్ స్థాయికి చేరి ఇప్పుడు నార్త్ లో పాగా వేసింది తమ్ము. వైవిధ్యమైన కథలను ఎన్నుకుంటూ తన నటనతో బీ టౌన్ ప్రేక్షకులను మెప్పించేందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. లేటెస్ట్ గా లేడీ బౌన్సర్ పాత్రలోనూ నటించి డీ గ్లామర్ తోనూ మెప్పించింది ఈ ముద్దుగుమ్మ. ఓవైపు సినిమాలు చేస్తూనే మరోవైపు ఫ్యాషన్ మీద ఉన్న తన ప్రేమను చూపిస్తోంది. అద్భుతమైన డిజైనర్ అవుట్ ఫిట్లను ధరిస్తూ హాట్ ఫోటో షూట్లను చేస్తూ కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేస్తుంది. తాజాగా తమన్నా ఐవరీ లెహంగా వేసుకుని ఫ్యాన్స్ ను మంత్రముగ్ధులను చేస్తోంది.

Tamannaah Bhatia : తమన్నా అద్భుతమైన ఫ్యాషన్ వాది. ఆన్ స్క్రీన్ లో ఎప్పుడు కనిపించినా తన వైవిధ్యమైన ఫ్యాషన్ అవుట్ ఫిట్స్ తో ఫ్యాషన్ ప్రియులను మెప్పిస్తుంటుంది. లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ లో కూడా ఐవరీ లెహంగా సెట్లో అద్భుతంగా కనిపిస్తోంది మిల్కీ బ్యూటీ. ఈ లెహంగా సెట్ ధర రూ. 58,500. కవిత, ప్రియాంక జైన్ లు నిర్వహిస్తున్న లగ్జరీ క్లాతింగ్ లైన్ దేవ్ నాగ్రి నుంచి హ్యాండ్ పెయింటెడ్ అవుట్ ఫిట్ ను ఎన్నుకుంది తమన్నా.

జరీ ఎంబ్రాయిడరీ తో వచ్చిన వైట్ స్కర్ట్ కి కాంబినేషన్ గా డీప్ వి నెక్ లైన్ తో వచ్చిన స్లీవ్ లెస్ బ్లౌజు జోడించింది మిల్కీ బ్యూటీ. దీని మీదకి ట్రాన్స్పరెంట్ దుపట్టాను వేసుకుని స్టైలిష్ లుక్స్ తో అందరినీ ఫిదా చేసింది. స్టైలిస్ట్ యామి తన ఇంస్టాగ్రామ్ లో తమన్నా పిక్స్ ను పోస్ట్ చేసింది . ఫాలోవర్స్ ఇన్ బాక్స్ లో క్రేజీ కామెంట్లు పోస్ట్ చేశారు.

ట్రెడిషనల్ లుక్ లోనే కాదు మోడర్న్ లుక్స్ తో మత్తెక్కించగలదు తమన్నా. తాజాగా బ్లాక్ అండ్ పింక్ కాంబినేషన్ లో వచ్చిన బాడీ హగ్గింగ్ గౌన్ వేసుకుని అదరగొట్టింది. డిజైనర్ గౌరీ, నైనికలు రూపొందించిన ఈ పింక్ గౌన్ లో తన అందాలను ఆరబోసి అభిమానులను అలరించింది.

ఈ మధ్యనే ఎరుపు రంగు చీర కట్టుకొని అందరి చూపును తన వైపుకు తిప్పుకుంది తమ్ము. డిజైనర్ పాయల్ రూపొందించిన ఈ శారీ లో అందమంతా ఈ చందమామ సొంతమయ్యింది.
