స్టార్ హీరోయిన్స్ గా దశాబ్ద కాలం పాటు టాలీవుడ్ లో తమ హవాని కొనసాగించిన అందాల భామలు తమన్నా, కాజల్ అగర్వాల్. ఈ వీరిద్దరూ స్టార్ హీరోయిన్స్ గా ఒకరికి ఒకరు ఎంత పోటీ పడతారో అంత మంచి ఫ్రెండ్స్ అనే విషయాన్ని చాలా సందర్భాలలో కూడా చెప్పారు. ఇక ఇప్పుడు ఈ బ్యూటీస్ ఇద్దరూ కూడా సీనియర్ హీరోయిన్స్ జాబితాలో చేరిపోయారు. సీనియర్ హీరోలకి జోడీగా నటిస్తున్నారు. కాజల్ అగర్వాల్ ప్రస్తుతం ఇండియన్ 2లో నటిస్తుండగా, తమన్నా భోళా శంకర్ లో చిరంజీవికి జోడీగా నటించింది. అలాగే వెంకటేష్ తో ఎఫ్2 చేసింది. ఇప్పుడు కింగ్ నాగార్జునతో కూడా రొమాన్స్ చేయడానికి రెడీ అవుతుంది.
మరో వైపు ఈ బ్యూటీస్ ఇద్దరూ కూడా ఐటెం సాంగ్స్ చేయడానికి కూడా ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఐటెం సాంగ్ కోసం ఏకంగా 50 లక్షల వరకు ఛార్జ్ చేస్తున్నారు. పుష్ప 2 కోసం సుకుమార్ ఊ అంటావా తరహాలోనే మరో క్రేజీ ఐటెం సాంగ్ ని ప్లాన్ చేస్తున్నారు. ఈ సాంగ్ కోసం ముందుగా బాలీవుడ్ ఐటెం క్వీన్ మలైకా అరోరాని తీసుకోవాలని అనుకున్నారు. అయితే ఇప్పుడు ఆ ప్లేస్ లోకి కాజల్ అగర్వాల్, తమన్నా వచ్చారు.
వీరిద్దరిలో ఒకరిని ఆ సాంగ్ కోసం ఎంపిక చేయాలని అనుకుంటున్నట్లు బోగట్టా. ఇక ఇద్దరూ కూడా సాంగ్ చేయడానికి సిద్ధంగానే ఉన్నారనే మాట వినిపిస్తుంది. అయితే వీరిలో సుకుమార్ ఫైనల్ గా ఎవరిని ఎంపిక చేస్తాడనేది చూడాలి. ఇదిలా ఉంటే తమన్నా అల్లు అర్జున్ తో బద్రీనాథ్ సినిమాలో హీరోయిన్ గా నటించగా, కాజల్ అగర్వాల్ ఆర్య 2, ఎవడు సినిమాలలో అల్లు అర్జున్ కి జోడీగా ఆడిపాడింది. ఇప్పుడు పుష్ప2లో అల్లు అర్జున్ కోసం ఐటెం భామ అవతారం ఎత్తడానికి వీరిద్దరూ పోటీ పడుతున్నారు.