సౌత్ లో కమర్షియల్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకొని బాలీవుడ్ లోకి అడుగుపెట్టి అక్కడ ఫీమేల్ సెంట్రిక్ కథలతో దూసుకుపోతున్న అందాల భామ తాప్సి పొన్ను. ఈ అమ్మడు ఓ వైపు బయోపిక్ లు మరో వైపు ఫీమేల్ సెంట్రిక్ కథలతో వరుసగా సినిమాలు చేస్తుంది. అలాగే హీరోయిన్ గా కూడా షారుక్ ఖాన్ మూవీలో సందడి చేస్తుంది. ఇదిలా ఉంటే ఈ మధ్యకాలంలో తాప్సి నటించిన సినిమాలు అన్ని ఫ్లాప్ అవుతూ వస్తున్నాయి. అదే సమయంలో మీడియా మీద తన దురుసు ప్రవర్తనతో తరుచుగా వార్తలలో నిలుస్తుంది. ఆ మధ్య దోబారా సినిమా ప్రమోషన్ కి ఆలస్యంగా వచ్చినందుకు అడిగారని మీడియాపై నోరు పారేసుకుంది.
ఆ తర్వాత తీరిగ్గా క్షమాపణలు చెప్పింది. తనని ఆ రిపోర్టర్ రెచ్చగొట్టడంతో అలా మాట్లాడాల్సి వచ్చిందని చెప్పుకొచ్చింది. అయితే తాజాగా ఓ మీడియా మీట్ లో తాప్సి రిపోర్టర్ పై మరోసారి రెచ్చిపోయింది. దోబారా సినిమాపై నెగిటివ్ ప్రచారం జరగడం వలనే సినిమా ఫ్లాప్ అయ్యిందని అనుకోవచ్చా అని ఒక జర్నలిస్ట్ తాప్సిని ప్రశ్నించగానే ఆమె వెంటనే తన ఆవేశాన్ని వెళ్లగక్కింది. ఏ సినిమాపై నెగిటివ్ ప్రచారం లేదు. అన్నింటి మీద ఉంటుందని, ఏ సినిమా మీద నెగిటివ్ ప్రచారం లేకుండా రిలీజ్ అవుతుందో చెప్పండి అంటూ ఆ జర్నలిస్టుని తిరిగి ప్రశ్నించింది. ఆమె ప్రశ్నలకి అతనికి సమాధానం చెప్పలేదు.
మీరు నా ప్రశ్నకి సమాధానం చెబితే నేను మీ ప్రశ్నకి సమాధానం చెబుతా. ప్రశ్న వేసే ముందు దానికి సంబంధించి పూర్తిగా తెలుసుకొని రండి. సగం సగం నాలెడ్జ్ తో క్వశ్చన్ చేయొద్దు అంటూ సీరియస్ అయ్యింది. ఈ ఘటన అక్కడున్న మీడియా వారిని విస్మయానికి గురి చేసింది. అయితే వరుస ఫ్లాప్ ల కారణంగానే తాప్సి ఇలా అసహనంతో అందరి మీద నోరుపారేసుకుంటుందని ప్రచారం ఇప్పుడు తెరపైకి వచ్చింది. ఆమె ఫ్లాప్ ల ఎఫెక్ట్ మనసుకి తీసుకుందని దీంతో స్ట్రెస్ ఎక్కువై ఇలా మాట్లాడుతుందని టాక్ నడుస్తుంది.