T20 WorldCup: ఈ ఆటగాడు వరల్డ్ కప్ జట్టుకు ఎంపికైన ఆటగాళ్ళలో లేడు. స్టాండ్ బైగా ప్లేయర్లలో ఒకడు. అయితే T20 వరల్డ్ కప్ ఆరంభానికి ముందే టీం ఇండియాకు ఊహించని షాక్ తగిలింది. గాయం కారణంగా బుమ్రా T20 వరల్డ్ కప్ కు దూరమయ్యాడు. అతడి స్థానంలో జట్టులోకి వచ్చిన ఆటగాడే మహమ్మద్ షమీ. అయితే ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచులో అదరగొట్టాడు. అద్భుతమైన బౌలింగ్ తో అందరి దృష్టిని తన వైపుకు తిప్పుకున్నాడు.
ఆస్ట్రేలియాతో జరిగిన వామప్ మ్యాచ్లో నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి టీమిండియా 187 పరుగులు చేసింది. ఈ మ్యాచ్లో కే ఎల్ రాహుల్, సూర్య కుమార్ యాదవ్ మెరుపులు మెరిపించారు. ఈ మ్యాచ్లో భువనేశ్వర్ కుమార్ పొదుపుగా బౌలింగ్ చేశాడు. కొన్ని మ్యాచుల నుండి టీమ్ ఇండియాకు డెత్ ఓవర్లలో బౌలింగ్ సమస్య వెంటాడుతుంది. వీటన్నింటికీ చెక్ పెడుతూ మహమ్మద్ షమీ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. లాస్ట్ ఓవర్ లో ఆస్ట్రేలియా విజయానికి 11 పరుగులు అవసరం అయ్యాయి.
చివరి ఓవర్ అందుకున్న మహమ్మద్ షమీ ఆస్ట్రేలియా బ్యాట్స్ మెన్లకు చుక్కలు చూపించాడు. మొదటి రెండు బందులకు బంతులకు రెండేసి పరుగులు చొప్పున ఇచ్చినా చివరి 4 బంతులకు నాలుగు వికెట్లు పడగొట్టాడు. మూడో బంతి సిక్సర్ దిశగా వెళ్లిన బౌండరీ లైన్ వద్ద విరాట్ కోహ్లీ అద్భుతమైన క్యాచ్ అందుకోవడంతో వికెట్ లభించింది. వరుస బంతుల్లో ఆస్ట్రేలియా బ్యాచ్ మెన్లను క్లీన్ బౌల్డ్ చేశాడు.
T20 WorldCup:
గత టి20 వరల్డ్ కప్ నుంచి ఈ వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆడిన ఏ ఒక్క టీ20 సిరీస్ లో కూడా మహమ్మద్ షమీ పాల్గొనలేదు. దీంతో షమీ బౌలింగ్ పై టీమిండియా ఎక్కువగా ఆశలు పెట్టుకోలేదు. కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ అద్భుతమైన ప్రదర్శనను చేశాడు. మహమ్మద్ షమీ ప్రదర్శనతో టీమిండియా గెలుపును సొంతం చేసుకుంది. ఇలాంటి ప్రదర్శననే మహమ్మద్ షమి సూపర్ -12లో పునరావృతం చేస్తే టీమిండియాకు ఎదురులేకుండా పోతుంది. నేరుగా సెమీ ఫైనల్స్ కు అర్హత సాధిస్తుంది.