T20 World Cup: టీ20 వరల్డ్‌కప్ 2022 అక్టోబర్ 16 నుంచి ప్రారంభమవుతున్న సంగతి తెలిసిందే. అయితే ఈ మెగా క్రికెట్ ఈవెంట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. చాలా మంది అభిమానులు టీవిలోనే క్రికెట్ మ్యాచ్ లను చూడటానికి ఇష్టపడతారు. మరికొందరైతే రియల్ ఎక్స్పీరియన్స్ కోసం స్టేడియంలో కూర్చొని మ్యాచ్ లను చూడాలని అనుకుంటారు. ఈసారి టీ20 ప్రపంచకప్ ఆస్ట్రేలియాలో జరగనుంది . క్రికెట్ మ్యాచ్ లను స్టేడియంలో కూర్చొని చూడాలనుకునే వారి కోసం టికెట్ ఎలా కొనుగోలు చేయాలని , వీసా ఎలా పొందాలనేది ఈ ఆర్టికల్ లో తెలుసుకుందాం.
టీ20 ప్రపంచ కప్ టికెట్లు ఎలా కొనుగోలు చేయాలి?
మొదటగా టీ20 ప్రపంచ కప్ అధికారిక వెబ్‌సైట్ t20worldcup.com ను ఓపెన్ చేసి టికెట్ కేటగిరీకి వెళ్ళాలి. అక్కడ బై టిక్కెట్ అనే ఆప్షన్ ను ఎంపిక చేసుకోవాలి. దీని తర్వాత మీరు ఏ మ్యాచ్ ను అయితే చూడాలనుకుంటున్నారో ఆ మ్యాచ్ ను ఎంచుకోవాలి.
భారత్ క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూసే భారత్ వర్సెస్ పాకిస్తాన్ వంటి కొన్ని మ్యాచ్‌ల టిక్కెట్లు ఇప్పటికే అమ్ముడుపోయినట్లు తెలుస్తోంది.
టికెట్ ధర ఎంతంటే?
పిల్లల టికెట్ల కనీస ధర 5 డాలర్లు 9సుమారు రూ. 410)గా ఉంది. పెద్దవాళ్ల టికెట్ కనీస ధరను 20 డాలర్లు (సుమారు రూ.1650)గా నిర్ణయించారు.
ఆస్ట్రేలియా వెళ్లాలంటే ఈటీఏ కావాలి :
ఆస్ట్రేలియా వెళ్లాలంటే మీకు ఎలక్ట్రానిక్ ట్రావెల్ అథారిటీ అవసరం. ఈటిఎను ఆస్ట్రేలియా ప్రభుత్వం మంజూరు చేస్తుంది. ఇది ఎలక్ట్రానిక్ వీసా. ఈ వీసా పొందిన తర్వాత మీరు టూరిస్టుగా 90 రోజులపాటు ఆస్ట్రేలియాలో ఉండొచ్చు. ఈ వీసా మీ పాస్ పోర్ట్‌తో లింక్ చేస్తారు.
T20 World Cup:
టీ20 వరల్డ్‌కప్ 2022లో భాగంగా అక్టోబర్ 23న క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురుచూస్తున్న భారత్ వర్సెస్ పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకుపొట్టి ప్రపంచ కప్ టోర్నీ జరగనుంది. 16 నుంచి 21 వరకు ఫస్ట్ రౌండ్(క్వాలిఫైయింగ్) మ్యాచ్ లు జరగుతాయి. అసలు మ్యాచ్‌లు అక్టోబర్ 22 నుంచి మొదలవుతాయి.