T20 World Cup: ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్ 16 నుంచి నవంబర్ 13 వరకు T20 ప్రపంచకప్ జరగనున్న నేపథ్యంలో ప్రతి జట్టు బలాలను, బలహీనతలను క్రికెట్ అభిమాని నుండి మాజీ క్రికెటర్లు, కామెంటేటర్లు, క్రికెట్ విమర్శకులు అంచనాలు వేస్తూ ఉంటారు. అలాగే కొన్ని జట్లు వారి అంచనాలను అందుకుంటూ వారి అంచనాలను తలకిందులు చేసే ప్రదర్శనలను కూడా చేస్తూ ఉంటాయి. వరల్డ్ కప్ సమరానికి ముందే T20 హిట్టర్, యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ ఆసక్తికర కామెంట్లు చేశాడు.
ప్రస్తుతానికి అసలు ఆరంభమే మొదలు కాలేదు కేవలం వామప్ మ్యాచులు మాత్రమే జరుగుతున్నాయి. కానీ మన యూనివర్సల్ బాస్ క్రిస్ గేల్ వరల్డ్ కప్ T20 ఫైనల్ చేరే జట్లను ముందే ప్రకటించేశాడు.
డిఫెండింగ్ ఛాంపియన్ గా బరిలోకి దిగుతున్న ఆస్ట్రేలియాకు సొంత గడ్డపై ఆడడం అతి పెద్ద ప్లస్ పాయింట్. వాటితో పాటు ఇంగ్లాండ్, న్యూజిలాండ్, పాకిస్తాన్ జట్లు మంచి ఫామ్ లో ఉన్నాయి. శ్రీలంకను ఏ మాత్రం తక్కువగా అంచనా వేసినా ప్రత్యర్థి జట్లు బోల్తా పడడం ఖాయం. ఆఫ్ఘనిస్తాన్ జట్టు ఏ జట్టుకైన షాక్ ఇవ్వడానికి రెడీగా ఉంటుంది. ఇన్ని అంచనాల మధ్య వెస్టిండీస్, ఆస్ట్రేలియా జట్లు ఫైనల్ చేరుతాయని మరోసారి జోస్యం చెప్పాడు. ఇండియా, ఇంగ్లాండ్ జట్లకు కప్ కొట్టేంత సీన్ లేదని చెప్పకనే చెబుతున్నాడు.
T20 World Cup:
T20 వరల్డ్ కప్ కు ముందే ఆస్ట్రేలియాలో అడుగుపెట్టిన వెస్టిండీస్ ఆస్ట్రేలియాతో ఒక T20 సిరీస్ ఆడి అందులో తేలిపోయింది. ఆడిన 2 T20 మ్యాచుల్లో ఓడిపోయింది. మరి ఇలాంటి జట్టు T20 వరల్డ్ కప్ ఫైనల్ కు వెళ్తుందని, వరల్డ్ కప్ కొడుతుందని ఎలా అంచనా వేశాడు అని క్రికెట్ అభిమానులు సైతం ఆశ్చర్యపోతున్నారు. ఏది ఏమైనా పొట్టి వరల్డ్ కప్ లో ఏమైనా జరగొచ్చు.