T20 World Cup: టీ20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ జట్టుకు అదృష్టం కలిసొచ్చింది. దీంతో ఆ జట్టు అనూహ్యంగా సెమీఫైనల్ చేరింది. దీంతో ఈ మెగా టోర్నీ ఫైనల్ భారత్-పాకిస్థాన్ మధ్య జరగాలని ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానులు ఆకాంక్షిస్తున్నారు. క్రికెట్‌లో దాయాదులు భారత్-పాకిస్థాన్ తలపడుతుంటే ఆ మ్యాచ్ చూస్తే వచ్చే మజానే వేరు. అందులోనూ పాకిస్థాన్‌ను టీమిండియా ఓడిస్తే సంబరాలే సంబరాలు. దీంతో చరిత్రలో నిలిచిపోయే మరో మ్యాచ్ జరుగుతుందని సోషల్ మీడియా వేదికగా అభిమానులు కామెంట్ చేస్తున్నారు.
ఇప్పటికే షేన్ వాట్సన్ వంటి దిగ్గజ ఆటగాళ్లు సైతం దాయాది జట్ల మధ్యే ఫైనల్ మ్యాచ్ జరగాలని ట్వీట్లు చేశారు. టీ20 ప్రపంచకప్‌లో ఇప్పటికే ఈ రెండు జట్లు తలపడగా చివరి బంతి వరకు ఉత్కంఠభరితంగా జరిగిన ఈ మ్యాచ్‌లో టీమిండియా విజయకేతనం ఎగురవేసింది. టీమిండియా స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీతో రాణించాడు. అతడికి హార్దిక్ పాండ్యా తన వంతు సహకారం అందించాడు. దీంతో భారత్ విజయం సాధించగా దేశవ్యాప్తంగా అభిమానులు సంబరాలు చేసుకున్నారు.
ఇప్పుడు మెగా టోర్నీ నాకౌట్ దశకు చేరుకోవడంతో మరోసారి ఇండియా, పాకిస్థాన్ తలపడితే చూడాలని ఇరు దేశాల అభిమానులు కోరుకుంటున్నారు. ఆ అవకాశం కూడా ఉండటంతో ఫైనల్ పోరులో భారత్, పాకిస్థాన్ జట్లను చూడాలని ఆకాంక్షిస్తున్నారు. 2007 ప్రపంచకప్ నాటి మధుర క్షణాలను మరోసారి ఆస్వాదించాలని తాపత్రయపడుతున్నారు. ఈ జాబితాలో దక్షిణాఫ్రికా లెజెండరీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ కూడా చేరాడు. ఈ మేరకు ట్విట్టర్‌లో ఓ పోల్ నిర్వహించాడు.
T20 World Cup: 77 శాతం మంది దాయాదుల పోరుకే ఓటు
ఇండియా, పాకిస్థాన్ మధ్య ఫైనల్ జరుగుతుందా లేదా అని ట్విట్టర్‌లో ఏబీ డివిలియర్స్ పోల్ నిర్వహించాడు. దీంతో ప్రపంచ వ్యాప్తంగా క్రికెట్ అభిమానుల్లో 77 శాతం మంది అవును అని సమాధానం ఇచ్చారు. ఈ మేరకు ఈ పోల్ ఫలితాన్ని ట్విట్టర్‌లో పోస్ట్ చేస్తూ తాను కూడా ఇదే జరగాలని కోరుకుంటున్నట్లు డివిలియర్స్ చెప్పాడు. కాగా ఈనెల 9న న్యూజిలాండ్, పాకిస్థాన్ మధ్య తొలి సెమీస్, ఈనెల 10న భారత్-ఇంగ్లండ్ మధ్య రెండో సెమీస్ జరగనున్నాయి. తొలి సెమీస్‌లో పాకిస్థాన్, రెండో సెమీస్‌లో టీమిండియా గెలిస్తే అభిమానుల ఆకాంక్ష నెరవేరుతుంది.
Pakistan/India final?
— AB de Villiers (@ABdeVilliers17) November 7, 2022