T20 World Cup 2022: సూపర్ -12 పోరుకు అర్హత సాధించడానికి క్వాలిఫయర్స్ ఆడుతున్న జట్లు తీవ్రంగా శ్రమిస్తున్నాయి. కొన్ని జట్లు అంచనాలకు మించి ప్రదర్శనలు చేస్తూ.. మరి కొన్ని జట్లు అంచనాలను తలకిందులు చేసే ప్రదర్శనలను కూడా కనబరుస్తున్నాయి. అక్టోబర్ 16న ప్రారంభమైన క్వాలిఫయర్స్ పోటీల్లో ఆయా జట్లు అద్భుతమైన ప్రదర్శనలు చేస్తున్నాయి. పసికూన నమీబియా జట్టు శ్రీలంకపై సంచలన విజయాన్ని నమోదు చేసింది.
అదేవిధంగా వెస్టిండీస్ పై అద్భుతమైన ప్రదర్శనలు చేసింది.
తాజాగా రెండుసార్లు T20 వరల్డ్ కప్ ఛాంపియన్ గా నిలిచిన వెస్టిండీస్ జట్టు మొదటి మ్యాచ్ లో నిరాశపరిచినా రెండో మ్యాచ్ లో తిరిగి పుంజుకుని జింబాబ్వే జట్టుపై గెలిచి సూపర్-12 పోటీలకు రేసులో తాము కూడా ఉన్నామని తెలిపింది. జింబాబ్వేతో జరిగిన పోరులో 31 పరుగుల తేడాతో గెలిచి సూపర్-12 పోరుకు అర్హత సాధించడానికి అవకాశాలను సజీవంగా ఉంచుకున్నది. వెస్టిండీస్ జట్టులో స్టార్ ఆటగాళ్లకు కొదువలేదు. కానీ ఈ స్టార్ ఆటగాళ్లు భారీ స్కోర్లు చేయడానికి విఫలమవుతున్నారు.
జింబాబ్వేతో జరిగిన మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ జట్టు 7 వికెట్ల నష్టానికి 153 పరుగులు చేసింది. 154 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వే జట్టు 122 పరుగులకే కుప్పకూలడంతో 31 పరుగుల తేడాతో వెస్టిండీస్ జట్టు జింబాబ్వేపై నెగ్గింది. అద్భుతంగా బౌలింగ్ చేసిన వెస్టిండీస్ బౌలర్ అల్జారి జోసెఫ్ 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు పడగొట్టి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ గా నిలిచాడు. తప్పక గెలవాల్సిన మ్యాచ్లో వెస్టిండీస్ జట్టు గెలిచి తమ సూపర్ -12 ఆశలను నిలబెట్టుకుంది.
T20 World Cup 2022:
జింబాబ్వే ఆటగాళ్లలో ఎవరు చెప్పుకోదగ్గ ప్రదర్శన చేయలేదు. వెస్టిండీస్ బౌలర్లలో అల్జారీ జోసెఫ్ నాలుగు ఓవర్లు వేసి కేవలం 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు కీలక వికెట్లు పడగొట్టాడు. జాసన్ వోల్డర్ మూడు వికెట్లు పడగొట్టి జింబాబ్వే జట్టు తక్కువ స్కోరుకే ఆలౌట్ అవడంలో కీలక పాత్ర పోషించాడు. వెస్టిండీస్ బ్యాటర్లలో జాన్సన్ చార్లెస్ 45 పరుగులు, రోమన్ పావెల్ 28 పరుగులు, అకీల్ హోసెన్ 23 పరుగులు చేయడంతో వెస్టిండీస్ జట్టు గౌరవప్రదమైన స్కోరు చేసింది. అక్టోబర్ 21న ఐర్లాండ్ తో జరిగే మ్యాచ్లో గెలిస్తే వెస్టిండీస్ జట్టు సూపర్-12 పోరుకు అర్హత సాధిస్తుంది.